ప‌వ‌న్ సినిమా… మిర‌ప‌కాయ్ – 2?

హ‌రీష్ శంక‌ర్ ని ద‌ర్శ‌కుడిగా నిల‌బెట్టిన సినిమా `మిర‌ప‌కాయ్`. నిజానికి ఈ సినిమాని ప‌వ‌న్ క‌ల్యాణ్ తో తీయాల‌నుకున్నాడు హ‌రీష్‌. కానీ కుద‌ర్లేదు. అది గుర్తుపెట్టుకునే హ‌రీష్ శంక‌ర్‌ని పిలిచి `గ‌బ్బ‌ర్ సింగ్‌` ని రీమేక్ చేసే అవ‌కాశం ఇచ్చాడు. ఇప్పుడు మ‌ళ్లీ వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతోంది. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా కూడా `మిర‌ప‌కాయ్‌` స్టైల్‌లోనే ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది.

ఈ సినిమాలో ప‌వ‌న్ ఏ పాత్ర‌లో క‌నిపిస్తాడ‌న్న విష‌యంలో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ పోలీస్ గా న‌టిస్తాడ‌ని, కాదు.. కాదు ప‌వ‌న్ లెక్చ‌ల‌ర్‌గా న‌టిస్తాడ‌ని గాసిప్పులు వినిపిస్తున్నాయి. ప‌వ‌న్ పోలీసే అని, కాక‌పోతే కొన్ని స‌న్నివేశాల్లో లెక్చ‌ల‌ర్ గా క‌నిపించాల్సివ‌స్తుంద‌ని అంటున్నారు. మిర‌ప‌కాయ్‌లో అంతే. పోలీస్ ఆఫీస‌ర్ అయిన క‌థానాయ‌కుడు, కొన్ని సన్నివేశాల్లో పాఠాలు చెప్పే మాస్టారుగా మారిపోతాడు. ఈసారీ అంతేలా క‌నిపిస్తోంది. దానికి త‌గ్గ‌ట్టు ప‌వ‌న్ పుట్టిన రోజున విడుద‌ల చేసిన ప్రీ లుక్ లో ఓవైపు భ‌గ‌వ‌ద్గీత‌, గులాబీ పువ్వుతో పాటు.. పిస్తోలూ క‌నిపిస్తోంది. మిర‌ప‌కాయ్‌ని ప‌వ‌న్ తో తీయ‌లేక‌పోయిన హ‌రీష్ ఆ లోటుని ఇలా తీర్చుకుంటున్నాడనిపిస్తోంది. ఆ లెక్క‌న‌ దీన్ని `మిర‌ప‌కాయ్ 2` అనుకోవాలేమో.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాప్ ద‌ర్శ‌కుల వెంట ప‌డుతున్న మెగా అల్లుడు

`విజేత‌`తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు క‌ల్యాణ్ దేవ్‌. రెండో సినిమా `సూప‌ర్ మ‌చ్చీ`. ఇది సెట్‌లో ఉండ‌గానే.. రెండు మూడు సినిమాలు సెట్ చేసుకున్నాడు. ఇప్పుడు త‌న ఖాతాలో మ‌రో సినిమా...

ఇన్‌సైడ్ టాక్‌: ‘ఉప్పెన’ పాట ‘వెర్ష‌న్‌’ల గోల‌

ఓ పాట‌కు ఒక‌డ్రెండు వెర్ష‌న్లు రాయించుకోవ‌డం ఇది వ‌ర‌కు ఉండేది. ఒకే ట్యూన్ ఇద్ద‌రు ముగ్గురికి ఇచ్చి, ఎవరి అవుట్ పుట్ బాగుంటే.. వాళ్ల పాట ఓకే చేయ‌డం జ‌రిగేది. అయితే.. ఇప్పుడు...

ప్రభుత్వ పెద్దల సన్నిహితుల చానల్‌లో మంత్రి వ్యతిరేకత వార్తల అర్థమేంటి..?

తెలంగాణకు చెందిన ఓ మంత్రి రాసలీలలంటూ తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అధీనంలో ఉన్న న్యూస్ చానల్ హంగామా ప్రారంభించడం టీఆర్ఎస్‌లో కలకలం రేపుతోంది.కొద్దీ రోజులుగా ఆ...

కళ్ల ముందు కనిపిస్తున్న ఇళ్లతో టీడీపీ రాజకీయం..!

పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తామంటూ హడావుడి చేసిన వైసీపీ సర్కార్... ఏడాదిన్నర గడిచిపోయినా ఆ దిశగా కనీసం అడుగులు వేయలేకపోయింది. ఆ పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న అభిప్రాయం...

HOT NEWS

[X] Close
[X] Close