హెచ్‌ఎండీఏ కంటే సీఆర్డీఏ పెద్దది…కానీ : కేటీఆర్

హైదరాబాద్ కంటే అమరావతి పెద్దది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన హెచ్‌ఎండీఏ కంటే… ఏపీ కొత్త రాజధాని సీఆర్డీఏ విస్తీర్ణం చాలా పెద్దది. ఈ విషయాన్ని స్వయంగా చెప్పింది తెలంగాణ మంత్రి కేటీఆర్. ఇలా చెప్పడానికి కారణం అమరావతిని ప్రమోట్ చేయడం కాదు. అక్కడ ఏమీ జరగడం లేదని.. భవిష్యత్ అంతా హైదరాబాదేనని పరోక్షంగా చెప్పడం. హైదరాబాద్‌లో కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద కార్పొరేట్ సంస్థల విరాళాలతో హైదరాబాద్ సుందరీకరణ పనులను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు.

హైదరాబాద్ పట్టణం గురించి .. హైదరాబాద్‌కు ఉన్న అనుకూలతల గురించి ప్రసంగించారు. ఈ సందర్భంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెలవప్‌మెంట్ అధారిటీ విస్తీర్ణం గురించి ప్రస్తావించారు. దేశంలోనే హెచ్‌ఎండీఏ అతి పెద్దదన్నారు. ఈ సందర్భంలోనే అమరావతిని గుర్తు చేసుకున్నారు. హెచ్‌ఎండీఏ కంటే అమరావతి అతి పెద్దదన్నారు. అయితే ఇప్పుడు అక్కడ పనులేం జరగడం లేదన్నారు. అంటే… పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్న అర్థంలో మాట్లాడారు. కేటీఆర్ మాట్లాడిన ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.

ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రాజధాని లేకుండా పోయింది. దీంతో అప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఖరారు చేసి సీఆర్డీఏను ఏర్పాటు చేసింది. 2014లో సీఆర్డీఏ చట్టాన్ని ముందుకు తెచ్చింది. కృష్ణాజిల్లా నందిగామ మొదలు, గుంటూరు జిల్లా చిలకలూరిపేట వరకు సీఆర్డీఏ విస్తరించింది. కోర్ క్యాపిటల్ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం ఎన్నో ప్రణాళికలు వేసింది. దాదాపుగా రూ. యాభై వేల కోట్ల విలువైన పనులు రాజధానిలో జరిగేవి. అయితే ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ అమరావతి నిర్మాణ పనుల్ని పూర్తిగా నిలిపివేశారు. దీంతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ఆకాశాన్ని తాకింది. ఏపీలో భూముల విలువలు పడిపోయాయి. ఏపీకి రాజధాని లేకుండా పోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close