క్రైమ్ : ఈ “జాలీ”కి జాలి, దయ లేవు..!

కొద్ది రోజులుగా కేరళకు చెందిన జాలీ అనే మహిళపై వస్తున్న కథనాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆమె గురించి బయటకు తెలిసింది కొంతే. తెలియాల్సింది కొండంత ఉంది. కుటుంబ సభ్యులనే వరుసగా… సైనెడ్ పెట్టి.. హత్య చేసిన వైనం.. వెలుగులోకి వచ్చిన తర్వాత ఆమె గురించి.. అనేక రకాల కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. వాటిలో కొన్ని నిజాలు.. మరెన్నో అనుమానాలు.

మురారి సినిమాలోలా.. ఆ ఇంట్లో… వరుస మరణాలు సంభవించాయి. పదిహేడేళ్లక్రితం ఓ పెద్దావిడ, 11 ఏళ్ల క్రితం ముసలావిడ భర్త, ఆ తర్వాత మూడేళ్లకు వాళ్ల కొడుకు, మరో మూడేళ్లకు ఆ వృద్ధురాలి తమ్ముడు, రెండేళ్ల తర్వాత వాళ్లకు దగ్గరి బంధువు ఇలా ఏదో శాపం ఉన్నట్లుగా అందరూ చనిపోవడం ప్రారంభించారు. ఏం జరుగుతుందో ఎవరికీ అంతుబట్టలేదు కానీ.. శాపం ఉందని మాత్రం అర్థం అయింది. ఆ శాపమేమిటో తెలుసుకునేందుకు చాలా సమయం పట్టింది. తెలిసే సరికి.. ఆ కుటుంబసభ్యుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ శాపం.. ఆ ఇంటి కోడలిగా వచ్చిన జాలీనే. ఆమె అందర్నీ పగబట్టి చంపేసింది.

ఆ ఇంట్లో చివరి మరణం 2016లో చోటు చేసుకుంది. ఈ కోడలి జాలీ హత్య చేసిన వారిలో భర్త కూడా ఉన్నారు. తన భర్తను చంపేసి.. మరిదిని పెళ్లి చేసుకున్నారు. అయితే.. ఆ మరిదికి కూడా ఇవన్నీ తెలియదు. వాస్తవానికి ఆ ఇంట్లో జరిగిన ఆరు మరణాలు సాధారణ మరణాలే అని పోలీసులు డిసైడైపోయారు. కుటుంబసభ్యులు, బంధువులంతా మిన్నకుండిపోయారు. కానీ ఎప్పుడో ఒక సారి పాపం పండక తప్పదు కాబట్టి… జాలీ మొదటి భర్త సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మరణాలపై సందేహాలున్నాయని అనుమానం వ్యక్తం చేశాడు. దాంతో అసలు నిజం బయటపడింది. కుటుంబసభ్యులందరినీ జూలీయే మరో ఇద్దరితో కలిసి హత్య చేసినట్లు తెలుసుకున్నారు. ఆహారంలో సెనైడ్ కలిపి అందరి ప్రాణాలు తీసిందని నిర్ధారించారు. ఆరుగురి మరణంపై ఓ పక్క పోలీసుల విచారణ జరుగుతుండగానే 2017లో తన భర్త బాబాయి కొడుకు అయిన షాజును జాలీ వివాహం చేసుకుంది. జాలీని అరెస్ట్‌ చేసిన పోలీసులు ఆమె వ్యక్తిత్వం ఎలాంటిదో కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. తన కుటుంబసభ్యులను, కట్టుకున్న భర్తను తన చేతులతో హతమార్చింది. ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తపడింది.

పోలీసులు మాత్రం ఆమెది స్ల్పిట్‌ పర్సనాలిటీ డిజార్డర్‌ అని అంచనా వేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా విచారించే సమయంలో కూడా నిబ్బరంగా వ్యవహరించిందని, ఆధారాలు చూపించాకే తన తప్పులు ఒప్పుకుందని అంటున్నారు. ఆమెను మనస్తత్వ నిపుణులతో పరీక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. వింటూంటేనే ఒళ్లు గగుర్పొడుస్తున్న ఈ దారుణాలను స్వయంగా చేసి కూడా పదిహేడేళ్లపాటు ఏమీ తెలియనట్లు నటించిందంటే ఖచ్చితంగా ఆమె మనస్తత్వంపై పరీక్షలు చేస్తున్నారు. ఇప్పుడు జాలీ కథ.. దేశవ్యాప్తంగా సంచలనం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close