చెన్నై అద‌ర‌గొట్టిందిగా

ఈసారి ఐపీఎల్ కొట్టేట్టే క‌నిపిస్తోంది చెన్నై. తొలి ఫేజ్ లో విజృంభించిన సూప‌ర్ కింగ్స్ … రెండో సీజ‌న్ ఆరంభ మ్యాచ్‌లోనూ త‌న ప్ర‌తాపం చూపించింది. ప‌టిష్ట‌మైన ముంబైని 20 ప‌రుగుల తేడాతో ఓడించి – ఈ ఫేజ్ ని ఘ‌నంగా ఆరంభించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 157 ప‌రుగులు చేసింది. అనంత‌రం ముంబై టీం.. నిర్ణీత 20 ఓవర్లతో 7 వికెట్లు కోల్పోయి 136 మాత్రమే చేసింది. దీంతో 20 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది.

నిజానికి చెన్నై ఆరంభం ఏమంత బాలేదు. తొలి 6 ఓవ‌ర్ల‌లో 24 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. కీల‌క‌మైన 4 వికెట్లు కోల్పోయింది. దానికి తోడు అంబ‌టి రాయుడు కూడా గాయంతో రిటైర్డ్ హార్డ్ గా వెనుదిరిగాడు. దాంతో.. చెన్నై క‌నీసం 100 ప‌రుగులైనా చేస్తుందా? అనిపించింది. ఈ ద‌శ‌లో రుతురాజ్ గైక్వాడ్ (55 బంతుల్లో 88) ఆదుకున్నాడు. జ‌డేజా (26), బ్రావో (8 బంతుల్లో 23) తోట్పాటు తో చెన్నైకి గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోరు అందించాడు. ధోనీ (3), రైనా (4), డుప్లెసీ (0), మొయిన్ అలీ (0) తీవ్రంగా నిశార ప‌రిచారు.

ఆ త‌ర‌వాత బ్యాటింగ్ కి దిగిమ‌న ముంబై – చెన్నై బౌల‌ర్ల‌ని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవ‌డంలో విఫ‌లం అయ్యింది. తివారీ (50) ఒక్క‌డే కాస్త రాణించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ ఆడ‌క‌పోవ‌డంతో పొలార్డ్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గంజాయి పట్టుకుంటున్న ఇతర రాష్ట్రాల పోలీసులు కుట్రదారులా !?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలే తేడాగా ఉంటోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ పోలీసుల్ని నమ్ముకుని అక్కడ డేటా చోరీ అంటూ అనేక రకాల కేసులు పెట్టించి ఏపీ అధికార పక్షాన్ని ఓ ఆట...

హైకోర్టులో జగన్ అండ్ కో పిటిషన్ల రోజువారీ విచారణ!

అక్రమాస్తుల కేసుల విచారణను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారంటూ జగన్ తో పాటు ఆయన సహ నిందితులపై చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు కింది కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు...

రొమాంటిక్… రామ్ స్పెషల్!

ఆకాష్ పూరి రొమాంటిక్ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్లు చేరిపోతున్నాయి. పూరి స్వయంగా ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్ ప్లే రాశారు. శివగామి రమ్యకృష్ణ సినిమాలో కీలక పాత్ర చేసింది. ప్రభాస్ ఈ...

పూరికి కోట్ల పబ్లిసిటీ ఇచ్చిన ప్రభాస్ !

పూరి జగన్నాధ్ కి ప్రభాస్ చాలా పెద్ద సాయమే చేశాడు. రొమాంటిక్ సినిమా ప్రమోషన్స్ లో భాగస్వామి అయ్యాడు. ట్వీట్ చేయడమో, పోస్ట్ పెట్టడమో కాదు.. ఏకంగా ఒక ఫుల్ డే కాల్...

HOT NEWS

[X] Close
[X] Close