విశ్వక్సేన్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం‘#కల్ట్’. ఇప్పటికే ఫస్ట్ లుక్ తో ఈ సినిమాలో వైలెన్స్ సాంపిల్ చూపించారు. ఇప్పుడు టీజర్ ని వదిలారు. గోవా బ్యాక్ డ్రాప్ కథని సిద్ధం చేశారు. ఇదొక పార్టీ థ్రిల్లర్. కల్ట్ అనే పార్టీలోకి పాసులతో ఎంట్రీ ఇచ్చిన జనం.. ఒక్కసారిగా డెడ్లీ గేమ్ లోకి వెళ్ళాల్సి వస్తోంది. తర్వాత జరిగిన పరిణామాలు యమడేంజర్ గా వుంటాయి.
స్క్విడ్ గేమ్ ఛాయల్లో నడిచిన కల్ట్ పార్టీ ఇది. ఒకొక్కరు అంత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోతుంటారు. ఫైనల్ గా విశ్వక్సేన్ పాత్ర ఎంట్రీ ఇచ్చి డెడ్లీ గేమ్ ని ఇంకా పీక్స్ లోకి తీసుకెల్తారు, టీజర్ సినిమా పాయింట్ క్లియర్ గా చెప్పారు. స్క్విడ్ గేమ్ తరహా సినిమాలని ఇష్టపడే ఆడియన్స్ కి ఇది బాగా కనెక్ట్ అవుతుంది. నాని హిట్ 3 సెకండ్ హాఫ్ కూడా దాదాపు ఇదే తరహ కల్ట్ గేమ్ తో వుంటుంది. ఇప్పుడు విశ్వక్సేన్ తనదైన శైలిలో ఓ డెడ్లీ గేమ్ తో వస్తున్నాడు.
వైలెన్స్, థ్రిల్, డెడ్లీ గేమ్స్ మేళవింపుతో ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది. ఇలాంటి సినిమాలకి కథలో ఉన్న మైండ్ గేమ్, డెడ్లీ ట్విస్ట్స్ చాలా కీలకం. అవి థియేటర్లలో ఎలా వర్క్ అవుతాయో చూడాలి.
