వైసీపీ అధినేత జగన్ పుట్టిన రోజు డిసెంబర్ 21.పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఆయన పార్టీ నేతలకు అందుబాటులో ఉండరు. పార్టీ నేతలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. క్రిస్మస్ సెలవులు కూడా కలసి వస్తాయి కాబట్టి ఆయన బెంగళూరు వెళ్లిపోయారు. పుట్టిన రోజు అక్కడే జరుపుకుంటారు. తాడేపల్లి ఇల్లు మాత్రం బోసిపోతుంది. అందుకే అక్కడ ఫ్లెక్సీలు కట్టడం డబ్బులు దండగ అనుకుని పార్టీ నేతలు పట్టించుకోవడం మానేశారు.
కానీ విచిత్రం హైదరాబాద్ నుంచి … అదీ శేరిలింగంపల్లి నుంచి ఎవరికీ తెలియని ఓ ఔత్సాహిక నేత ఇంటి ముందు కటౌట్లు పెట్టించారు. అందులో జగన్ తో పాటు కేసీఆర్, కేటీఆర్ కూడా ఉన్నారు. దీంతో ఆయన వైసీపీ నేతనా.. లేకపోతే బీఆర్ఎస్ నేతనా అన్నది చూసే వారికి క్లారిటీ రాలేదు. వచ్చే ఎన్నికల్లో జగన్ తో సిఫారసు చేయించుకుని బీఆర్ఎస్ తరపున శేరిలింగంపల్లి టిక్కెట్ పొందాలని ఆయన స్కెచ్ వేశారేమో కానీ.. అందరి దృష్టిలో పడేందుకు ఇలా ఒక్క కటౌట్ తో ప్రయత్నం చేశారు. కాస్త ఖర్చు అయినా హైదరాబాద్ నుంచే వాటిని తెచ్చుకున్నారు.
జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఓడిపోయి ఇద్దరూ ఖాళీగా ఉన్నా ఆ అనుబంధం సాగుతూనే ఉందని ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో కేటీఆర్, జగన్ కలుసుకున్నప్పుడు క్లారిటీ వచ్చింది. తాను జగన్ తో భేటీ అయ్యానని కేటీఆర్ చెప్పుకున్నారు కానీ.. జగన్ మాత్రం కేటీఆర్ తో సమావేశం జరిగిందని ట్విట్టర్ లో కూడా ప్రకటించలేదు.


