అది కల్తీ మద్యం కాదు…అందులో సైనేడ్ విషం కలిసిందిట!

కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు కుటుంబీకులకు చెందిన స్వర్ణా బార్ అండ్ రెస్టారెంట్ లో అమ్మబడిన కల్తీ మద్యంలో అత్యంత ప్రమాదకరమయిన పొటాషియం సైనేడ్ అనే విష పదార్ధం కలుపబడినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రాధమికంగా నిర్ధారణ చేసింది. కానీ దీనిని మళ్ళీ నిర్ధారించుకొనేందుకు స్వర్ణా బార్ అండ్ రెస్టారెంట్ లో నుండి సేకరించిన మద్యం నమూనాలను హైదరాబాద్ లోని కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు. అది కూడా పొటాషియం సైనేడ్ కలిసినట్లు నిర్ధారణ చేసినట్లయితే ఇది సాధారణ కల్తీ మద్యం కేసు కాదని, మల్లాది విష్ణు యొక్క వ్యాపార లేదా రాజకీయ శత్రువులు ఎవరో ఆయనను దెబ్బ తీసేందుకు కావాలనే చేసిన కుట్ర అని అనుమానించవలసి ఉంటుంది.

డిశంబర్ 8వ తేదీన కృష్ణలంకలో మల్లాది విష్ణు కుటుంబీకులకు చెందిన స్వర్ణా బార్ అండ్ రెస్టారెంట్ లో కల్తీ మద్యం త్రాగి ఐదుగురు వ్యక్తులు చనిపోయారు. ఈ సంఘటన జరిగిన వెంటనే ఎక్సయిజ్ శాఖ అధికారులు స్వర్ణా బార్ అండ్ రెస్టారెంట్ లో సరఫరా అవుతున్న మద్యం నమూనాలను సేకరించి బార్ ని మూసివేశారు. సాధారణంగా కల్తీ మద్యం అనగానే అందులో మిథైల్‌ ఆల్కహాల్‌ కలిసి ఉండవచ్చని అనుమానిస్తారు. కానీ దీనిలో భయంకరమయిన సైనేడ్ విషపదార్ధం కనుగొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మల్లాది విష్ణుతో సహా అనేకమందిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన ఈ తాజా నివేదిక ఈ కేసును కొత్త మలుపు తిప్పే అవకాశం కనబడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మా రాష్ట్రానికి రండి… రేవంత్ కోసం 7 రాష్ట్రాల రిక్వెస్ట్!

గెల‌వ‌టం అసాధ్య‌మ‌నుకున్న తెలంగాణ‌లో పార్టీని గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డికి... ఇత‌ర రాష్ట్రాల నుండి మా రాష్ట్రానికి రండి అంటూ ఇన్విటేష‌న్లు వ‌స్తున్నాయి. మా రాష్ట్రంలో తెలుగు వారున్నారు మీరు రండి అంటూ...

నేల దిగిన విక్ర‌మ్‌… ఈసారి కొట్టేస్తాడేమో..?!

విక్ర‌మ్ న‌టుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ప్ర‌తీసారీ ఏదో ఓ రూపంలో కొత్త‌ద‌నం ఇవ్వాల‌నే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంటాడు. అదే త‌న ప్ల‌స్సు, అదే మైన‌స్సు కూడా. మితిమీరిన ప్ర‌యోగాల‌తో చేతులు కాల్చుకోవ‌డం...

మోత్కుపల్లి ఏ పార్టీలో ఉన్నా అంతే !

మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని.. మఖ్యమంత్రి రేవంత్ తప్పు చేస్తున్నారని తెరపైకి వచ్చారు. ఒక రోజు దీక్ష చేస్తానని ప్రకటించారు. నిజానికి మోత్కుపల్లి...

తగ్గేదేలే – తోట త్రిమూర్తులే అభ్యర్థి !

దళితుల శిరోముండనం కేసులో దోషిగా తేలి జైలు శిక్షకు గురైన మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిముర్తులకు జగన్ అభయం ఇచ్చారు. జైలు శిక్ష పడినా అభ్యర్థి ఆయనేనని స్పష్టం చేయడంతో ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close