ఏపీ సీఐడీ ఎంత అరాచక శక్తిగా మారిపోయిందో కళ్ల ముందు కనిపిస్తనే ఉంది. ఈ అరాచక శక్తిగా వచ్చిన పేరును ఉపయోగించుకుని ఏపీ పోలీసులే కిడ్నాప్ ముఠాగా ఏర్పడి .. కిడ్నాప్‌లు ప్రారంభించారు. ఓ ముఠా హైదరాబాద్‌లో పట్టుబడింది. ఈ వ్యవహారం ఏపీ పోలీసుల తీరును .. క్రిమినల్ పాలనలో క్రిమినల్స్ గామారిన రక్షకభటుల వ్యవస్థ తీరును కళ్లముందు ఉంచుతోంది. హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీకి ఏపీ సీఐడీ అధికారులు వెళ్లారు. తమకు చాలా ఫిర్యాదులు వచ్చాయని.. కంపెనీ ఓనర్ ను అదుపులోకి తీసుకుంటున్నామని చెప్పి తీసుకెళ్లారు.
తర్వాత అతన్ని ఓ చోట బంధించి పదికోట్లు డిమాండ్ చేశారు. ఫిర్యాదు అందడంతో సైబరాబాద్ పోలీసులు చురుకుగా వ్యవహరించి కిడ్నాప్ ముఠాను పట్టుకున్నారు. కిడ్నాప్ ముఠాలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి ప్రస్తుతం కర్నూలు డీఐజీ ఆఫీసులో ఎస్ఐగా పని చేస్తున్న సృజన్ గా గుర్తించారు. ఏపీ పోలీసు శాఖలో మాజీ ఉద్యోగి రంజిత్ తో కలిసి .. సీఐడీ పేరుతో కిడ్నాప్ ముఠాగా మారి కోట్లు వసూలు చేస్తున్నారు. వీరి వివరాల్ని సైబరాబాద్ పోలీసులు బయట పెట్టారు.
అరెస్ట్ చేసిన వారి గురించి చెప్పారు. ఏపీసీఐడీ అధికారులు ఇలా ఎలాంటి ఫిర్యాదులు ఉన్నాయో కూడా చెప్పకుండా మనుషుల్ని కిడ్నాప్ చేసినట్లుగా అరెస్టులు చేసి తీసుకె్ళ్లడం కామన్ అయిపోయింది. దీన్నే ఉపయోగించుకుని ఏపీలో ఎస్ఐ స్థాయి ఉద్యోగే ఇలా ముఠాగా ఏర్పడి కిడ్నాప్‌లు చేయడం సంచలనంగా మారింది. ఏపీ పోలీసుల పరువు మరోసారి బజారున పడినట్లయింది.