డీఎస్ తో ఉత్త‌మ్ భేటీ కూడా జ‌రిగిపోయింది..!

తెరాస నుంచి సీనియ‌ర్ నేత ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్ నిష్క్ర‌మ‌ణ దాదాపు ఖ‌రారు అయిపోయిందనే చెప్పాలి! నిజానికి, కొన్ని నెల‌ల కింద‌టి నుంచే ఈ చ‌ర్చ జ‌రుగుతోంది. నిజామాబాద్ జిల్లా నేత‌ల‌తో ఆయ‌న‌కి పొస‌గ‌డం లేద‌న్న‌ది తెలిసిందే. వారంతా కేసీఆర్ కి ఫిర్యాదులు చెయ్య‌డం, అనంత‌రం విమ‌ర్శ‌లూ వివ‌ర‌ణ‌లూ.. ఈ మధ్యనే తెరాసను సవాలు చేసే విధంగా డీఎస్ మాట్లాడుతూ ఉండటం చూస్తూనే ఉన్నాం. ముంద‌స్తు ఎన్నిక‌ల హ‌డావుడిలో తెరాస శ్రేణుల‌న్నీ నిమ‌గ్న‌మై ఉన్నా… ఆయ‌న మాత్రం కాస్త దూరంగానే ఉంటూ వ‌స్తున్నారు. దీంతో ఆయ‌న మ‌రోసారి కాంగ్రెస్ లోకి చేర‌డం దాదాపు ఫిక్స్ అనే అభిప్రాయం వ్య‌క్త‌మౌతూ వస్తోంది. ఈ దిశ‌గా ఈరోజు మ‌రో ముంద‌డుగు ప‌డింది. డీఎస్ ఇంటికి తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వెళ్లారు.

ఉద‌యాన్నే డీఎస్ నివాసానికి వెళ్లిన ఉత్త‌మ్ కుమార్.. దాదాపు గంటసేపు స‌మావేశ‌మైన‌ట్టు స‌మాచారం. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఈరోజే ఢిల్లీ బ‌య‌లుదేరి వెళ్ల‌బోతున్నారు. దీంతో, హైక‌మాండ్ ని క‌లుసుకునే ముందుగా డీఎస్ తో భేటీ కావ‌డం కాస్త ప్ర‌త్యేకంగానే క‌నిపిస్తోంది. డీఎస్ డిమాండ్ల‌ను తెలుసుకుని, వాటిని హైక‌మాండ్ కి ఉత్త‌మ్ నివేదించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డమే ఆల‌స్యం, డీఎస్ చేరిక లాంఛ‌నం పూర్త‌వుతుంద‌న్న‌ట్టుగానే టి. కాంగ్రెస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్ర‌ముఖ కాంగ్రెస్ నేత సురేష్ రెడ్డిని ఇటీవలే తెరాస ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే. కాబ‌ట్టి, వెంట‌నే డీఎస్ ని చేర్చుకోవ‌డం ద్వారా తెరాసకి గ‌ట్టి బ‌దులు చెప్పిన‌ట్టు అవుతుంద‌నేది కాంగ్రెస్ వ్యూహంగా క‌నిపిస్తోంది. ఎలాగూ తెరాస‌పై ఆయ‌న తీవ్ర అంస‌తృప్తితో ఉన్నారు కాబ‌ట్టి, పార్టీలోకి చేర్చుకున్నాక కేసీఆర్ తీరుపై డీఎస్ తీవ్రంగా విమ‌ర్శలు చేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌నే చెప్పొచ్చు! ఇంకోటి… ఆ జిల్లాలో ఇప్పుడున్న కాంగ్రెస్ శ్రేణుల‌ను న‌డిపించేందుకు కూడా ఒక ప‌ట్టున్న నాయ‌కుడి అవ‌స‌రం కనిపిస్తోంది. ఇలా చూసుకున్నా డీఎస్ ని వెంట‌నే పార్టీలోకి ఆహ్వానించాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ పాచిక..! ఎవరీ ఆకుల వెంకటేష్..?

తిరుపతి ఉపఎన్నికల పోలింగ్ ముందు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ... ఏకంగా అచ్చెన్నాయుడుపైనే స్టింగ్ ఆపరేష్ చేయడమే కాదు.. వైసీపీకి మద్దతుగా ప్రకటనలు చేస్తున్న ఆకుల వెంకటేష్ ఎవరన్నదానిపై ఇప్పుడు టీడీపీలో...

శ్రీవారిని ఒక్క సారీ దర్శించుకోని వైసీపీ అభ్యర్థి..!

తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తిపై భారతీయ జనతా పార్టీ నేతలు కొత్త కొత్త విషయాలు ప్రసారం చేస్తున్నారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి ఇంత వరకూ ఒక్క సారంటే ఒక్క సారి కూడా తిరుమల...

కోల్‌కతా ఓడిపోవడానికే ఆడినట్లుందే..!?

ఎవరైనా మ్యాచ్‌లు ఎందుకు ఆడతారు..? గెలవడానికే ఆడతారు. కానీ ఓడిపోవడానికే ఆడితే ఎలా ఉంటుంది..?. నిజంగా ఓడిపోవడానికి ఎవరూ ఆడరు..కానీ మంగళవారం నాటి ముంబై, కోల్‌కతా మ్యాచ్ చూస్తే రెండు జట్లు ఓడిపోవడానికి...

ఆ ప్రాజెక్ట్ చూస్తామంటే కుదరదంటోన్న ఏపీ..!

ఓ ప్రాజెక్ట్‌ను చూడటానికి వస్తామని కృష్ణాబోర్డు అంటోంది. చూసేందుకు కూడా ఒప్పుకోబోమని.. ఏపీ సర్కార్ తేల్చి చెబుతోంది. కృష్ణా బోర్డు మాత్రం.. అదే పనిగా తాము వస్తున్నామని తేదీ ఖరారు చేసి ఏపీ...

HOT NEWS

[X] Close
[X] Close