టాలీవుడ్‌కి ‘డేంజ‌ర్‌’ బెల్స్‌

బండ్ల గ‌ణేష్‌కి క‌రోనా… అనే వార్త టాలీవుడ్ లో క‌ల‌క‌లం రేపుతోంది. `నాకు క‌రోనా ఉంది` అని గ‌ణేష్ ప్ర‌క‌టించ‌లేదు గానీ, మీడియా అంత‌టా ఇదే హాట్ టాపిక్‌. ఇదే నిజ‌మైతే టాలీవుడ్ లో క‌రోనా బారిన ప‌డిన తొలి వ్య‌క్తి గ‌ణేష్ అవుతాడు.

టాలీవుడ్ ఇప్పుడు షూటింగుల కోసం ఎదురు చూస్తోంది. క‌రోనా భ‌యాలు వెంటాడుతున్నా, స్టార్లు సెట్లో అడుగుపెట్ట‌డానికి జంకుతున్నా – ఏదోలా షూటింగు చేసుకోవాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నారు. హీరోల్ని ఎలాగోలా ఒప్పించి.. వాళ్ల‌ని సెట్స్‌పైకి తీసుకురావాల‌ని ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నారు. ఈ ద‌శ‌లో `బండ్ల‌కు క‌రోనా` వార్త‌.. ముంద‌ర కాళ్ల‌కు బంధం వేసేలా మారింది. నిర్మాత‌ల కోస‌మో, త‌మ సినిమాల్ని త్వ‌ర‌గా పూర్తి చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌తోనో షూటింగుల‌కు వ‌ద్దామ‌నుకుంటున్న హీరోలు ఇప్పుడు మ‌రింత భ‌య‌ప‌డే ప్ర‌మాదం ఉంది. బండ్ల కి క‌రోనా సినిమాల వ‌ల్ల రాలేదు. సెట్లో అడుగుపెట్ట‌డం వ‌ల్ల రాలేదు. కానీ.. త‌ను సినిమా వాడే. అందుకే… ఇప్పుడు చిత్ర‌సీమ‌లో అంత క‌ల‌క‌లం. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా, క‌రోనా ఏదో ఓ రూపంలో మ‌నిషికి క‌బ‌ళిస్తుంద‌న్న భ‌యాలు సినిమా వాళ్ల‌లో ఎక్కువ అవుతున్నాయి. క‌రోనాకి సెల‌బ్రెటీ – నాన్‌సెల‌బ్రెటీ అనే తేడా లేదు. కాస్త అద‌మ‌ర‌చినా వాలిపోతుంది. సెట్లో ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా, క‌రోనాని అట్టుకోవ‌డం క‌ష్ట‌మ‌న్న అభిప్రాయానికి హీరోలు వ‌చ్చేస్తే – ఇక సినిమా షూటింగులు ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఊపందుకోవు. ఓర‌కంగా బండ్ల‌కు క‌రోనా అన్న వార్త‌.. టాలీవుడ్ లో డేంజ‌ర్ బెల్స్ మోగించిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకలోనూ పచాయతీ ఎన్నికలు..!

కరోనా కేసులు ఆంధ్రతో పోలిస్తే ఎక్కువగా నమోదవుతున్న కర్ణాటకలోనూ పంచాయతీ ఎన్నికలు జరగుతున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ ప్రకటించేశారు. డిసెంబర్‌ 22, 27న రెండు దశల్లో ఎన్నికలు...

పాపం ఏపీ రైతులు..! పంటల బీమా సొమ్ము కూడా రాదు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించడానికి పెద్దగా ఇష్టపడటం లేదు. ఆర్థిక సమస్యలో.. మరో కారణమో కానీ.. ఏమీ ఇవ్వడం లేదు. కానీ ప్రభుత‌్వాలు ఆనవాయితీగా పంటల బీమా చెల్లిస్తూ వస్తున్నాయి. కొంత...

హైదరాబాదీ.. కమాన్ లెట్స్ ఓట్..!

చదువుకున్న వాళ్లు ఓటు వేయరా..!? భారత దేశంలో ఎప్పుడు.. ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా.. మెట్రో సిటీలు లేని నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం ఎనభై శాతం వరకూ ఉంటుంది. వ్యవసాయదారులు.. చిన్న వ్యాపారులు.. చిరు...

టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల కన్నుమూత..!

తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన మరో ఎమ్మెల్యే కన్నుమూశారు. నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డిపై గెలిచిన నోముల నర్సింహయ్య.. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నోముల నర్సింహయ్య...

HOT NEWS

[X] Close
[X] Close