పెంగ్విన్‌ని ఎంత‌కి కొన్న‌ట్టు?

భారీ ప్ర‌చారం, అంచ‌నాల మ‌ధ్య ‘పెంగ్విన్‌’ అమేజాన్ ప్రైమ్‌లో విడుద‌లైంది. కీర్తి సురేష్ సినిమా కావ‌డం, కొన్నాళ్లుగా స‌రైన సినిమా లేక ప్రేక్ష‌కులు మొహం వాచి పోయి ఉండ‌డంతో – ఈ సినిమా కోసం జ‌నాలు ఆస‌క్తిగా ఎదురు చూశారు. తీరా చూస్తే.. `పెంగ్విన్` నిరాశ ప‌రిచింది. న‌త్త‌న‌డ‌క స్క్రీన్ ప్లే, పేల‌వ‌మైన క్లైమాక్స్ తో `పెంగ్విన్‌` దారుణంగా డింకీ కొట్టింది. కాక‌పోతే.. అమేజాన్ ప్రైమ్‌లో నిన్నంతా పెంగ్విన్‌దే హ‌వా. మూడు భాష‌ల్లో తీసిన సినిమా కావ‌డంతో వ్యూవ‌ర్ షిప్‌కి ఢోకా లేకుండా పోయింది.

ఈ సినిమాని ఎంతకి కొన్నారు? నిర్మాత‌ల లాభ‌మెంత‌? అనే విష‌యంపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ సాగుతోంది. ఈ సినిమా దాదాపుగా 7.5 కోట్ల‌కు అమేజాన్ సొంతం చేసుకున్న‌ట్టు టాక్‌. వ్యూవ‌ర్ షిప్ ని బ‌ట్టి, ఆ త‌ర‌వాత ఆదాయాన్ని షేర్ చేయ‌డానికి అమేజాన్ ఒప్పుకుంద‌ట‌. ఇన్ని ల‌క్ష‌ల గంట‌ల‌కు ఇంత మొత్తం… అని ముందే అమేజాన్ `పెంగ్విన్‌` నిర్మాత‌తో ఒప్పందం చేసుకుంద‌ట‌. ఓటీటీ సంస్థ‌ల్లో వ్యూవ‌ర్ షిప్ ని గంట‌ల్లో లెక్క గ‌డ‌తారు. ఎన్నిసార్లు చూశారు? ఎంత‌మంది చూశారు? అనేది కీల‌కం కాదు. కేవ‌లం ఎన్ని గంట‌లు చూశారు? అనేదే లెక్క‌. అంటే.. ఈ సినిమాని జ‌నాలు చూసేకొద్దీ నిర్మాత‌కు ఆదాయం పెరుగుతూ వెళ్తుంద‌న్న‌మాట‌. ఈ లెక్క‌న `పెంగ్విన్‌` నిర్మాత గ‌ట్టెక్కేసిన‌ట్టే. ఈ సినిమా చూసిన‌వాళ్ల‌కెవ‌రికైనా ‘లో బ‌డ్జెట్ సినిమా’ అనే విష‌యం అర్థ‌మైపోతుంటుంది. ఎందుకంటే కీర్తి త‌ప్ప స్టార్ కాస్టింగ్ ఎవ‌రూ లేరు. అతి త‌క్కువ లొకేష‌న్ల‌లో సినిమాని న‌డిపించేశారు. ఈ లెక్క‌న నిర్మాత‌లు సేఫ్ అనుకోవొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close