” ఆ రెండు కేసులు” – వైసీపీకి డేంజర్ బెల్స్ !

గత ఎన్నికల్లో అధికారం తెచ్చిపెట్టిన ఆ రెండు కేసులు వైసీపీకి ఇప్పుడు ప్రమాదకరంగా మారాయి. ఈ కేసులు ప్రతిపక్షాలకు సంబంధం లేనివి. గతంలో తమకు రాజకీయంగా మేలు చేసిన కేసులు ఇప్పుడు వైసీపీకి పెనుగండంగా మారాయి. ఎలా సమర్థించుకోవాలో తెలియక తప్పు మీద తప్పు చేస్తున్నారు. ప్రజల్లో చులకన అవుతున్నారు. అయినా పర్వాలేదు.. తాము జైలుకెళ్లకూడదని వారు దిగజారిపోయే పనులు చేస్తున్నారు.

వైఎస్ వివేకా హత్య ఘటన గత ఎన్నికలకు ముందు జరిగింది. రకరకాల మలుపులు తిరిగి చివరికి క్లైమాక్స్‌కు వచ్చింది. సుప్రీంకోర్టు కూడా విచారణ వేగంగా పూర్తి చేయాలని ఆదేశించింది. ఇప్పుడు ఈ కేసులో సీబీఐ ప్రధాన నిందితులుగా చెబుతున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలను వైఎస్ఆర్‌సీపీ మరో మాట లేకుండా సపోర్ట్ చేస్తోంది. కారణం ఏమిటో తెలియదు కానీ నిజాయితీ నిరూపించుకోవాలని వైఎస్ అవినాష్ రెడ్డికి ప్రభుత్వ పెద్దలు చెప్పడంలేదు.. ఆయన నిజాయితిని నిరూపించడానికి వారే కష్టపడుతున్నారు. అసలు నిందితుల్ని ఎందుకు రక్షిస్తున్నారనే ప్రశ్న సామాన్యులకు వస్తోంది.

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్‌పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడి కేసు దర్యాప్తును ఎన్‌ఐఏ పూర్తి చేసింది. ఎన్‌ఐఏ కోర్టులో విచారణ ప్రారంభమయింది. బాధితుడు అయిన సీఎం జగన్ సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు వెళ్లడంలేదు . సానుభూతి కోసం జగన్ డ్రామా ఆడారన్న విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ కేసు విషయంలో ఎన్ ఐఏ దర్యాప్తు కోరుకుంది వైఎస్ఆర్‌సీపీనే. ఇప్పుడు ఎన్ఐఏ దర్యాప్తు సరిగ్గా లేదని తాము చెప్పిన కోణాల్లో దర్యాప్తు చేయలేదని .. ఆ దర్యాప్తు సంస్థ తీరును విమర్శిస్తున్నారు.

ప్రజల్లో దేనిపై ఎక్కువ చర్చ జరిగితే దాన్నే ఎన్నికల ఎజెండా. ఇప్పుడు ఈ రెండుకేసుల్లో జగన్ తీరే హైలెట్ అవుతోంది. అప్పట్లో అధికారం తెచ్చి పెట్టిన కేసులు ఇప్పుడు ఆ అధికారాన్ని పీకేస్తాయనే ఆందోళన వైసీపీలో కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ : బాలకృష్ణ

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై సినీ పరిశ్రమ స్పందన తీరుపై చాలా విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు పాలనలో ఎంతో అభివృద్ధి సాధించిన సినీ పరిశ్రమ, అలాగే లబ్దిపొందిన చాలా...

జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లేది నిజం – మోదీ, షాలతో భేటీ డౌట్ !

లండన్ లో ఉండి చంద్రబాబును అరెస్టు చేయించి ఇండియాకు రాక ముందే ఢిల్లీ పర్యటన పేరుతో ప్రచారం చేసుకుని మోడీ , షాలతో భేటీ అవుతారని ప్రచారం చేయించుకున్న జగన్ రెడ్డి తాపత్రయం...

చంద్రబాబుకు డబ్బు ముట్టినట్లు ఆధారాలున్నాయా ?: ఏసీబీ కోర్టు జడ్జి

చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్, అలాగే బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్లపై విచారణ ఏసీబీ కోర్టులో జరిగింది. ఉదయం చంద్రబాబు తరపు లాయర్ దూబే, మధ్యాహ్నం...

సుధీర్ బాబుకి ‘హంట్’ నేర్పిన గుణపాఠం

సుధీర్ బాబు 'హంట్' సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అయ్యింది. కెరీర్ లో పలు ప్రయోగాలు చేసిన సుధీర్ బాబు.. హంట్ కూడా తనకు మరో ప్రయోగాత్మక చిత్రం అవుతుందని బలంగా నమ్మాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close