మళ్లీ కేసీఆర్ మౌనవ్యూహం !

కేసీఆర్ మళ్లీ మౌనంగా మారిపోయారు. ఆయన ఏమీ మాట్లాడటం లేదు. మాటల యుద్ధం కూడా ఆపేశారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనకు వస్తే కనీసం ఆహ్వానం చెప్పకపోవడం యుద్ధంలో భాగం అనుకోవాలి తప్ప… మరే విధంంగానూ పోరాటం అనే కార్యాచరణ కనిపింంచడం లేదు. ఇంకా చెప్పాలంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీని పల్లెత్తు మాట అనడం లేదు. అనాల్సి వచ్చినా ఆయన మీడియా కెమెరాలన్నిటినీ ఆపు చేయించి అంటున్నారు కానీ రికార్డెడ్ గా అనడానికి మాత్రం సందేహిస్తున్నారు.

కేంద్రంపై పోరాటంలో కేసీఆర్ నిస్సహాయత చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఓ వైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ పేరు కూడా తెరపైకి తెస్తున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు . ఈ ప్రశ్నల్లో ప్రధానంగా కేసీఆర్ తో ఉన్న ఆర్థిక సంబంధాల గురించే వచ్చాయన్న ప్రచారం గుప్పుమంది. ఓ వైపు తనను బీజేపీ రౌండప్ చేస్తోందని అర్థమవుతూనే ఉంది. అయినప్పటికీ కేసీఆర్ స్ట్రాటజిక్ సైలెన్స్ పాటిస్తూనే ఉన్నారు.

కేసీఆర్ జాతీయ పార్టీగా టీఆర్ఎస్‌ను మార్పు చేసుకుంటున్నట్లుగా ప్రకటించిన తర్వాత భారీ ఖర్చు పెట్టి మీడియాలో ప్రకటనలు ఇచ్చుకున్నారు కానీ నేరుగా ఇతర రాష్ట్రాల్లో చేసిన రాజకీయమే లేదు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో రెండు సభలు పెట్టారు. మూడో సభ కూడా అక్కడే పెడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రకటన తర్వాత మొదటి టార్గెట్ కర్ణాటక అని స్వయంగా ప్రకటించారు. ఇప్పుడు కర్ణాటకలో నామినేషన్ల గడువు కూడా ముగిసింది. కానీ ఆయన ఒక్క మాటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు కర్ణాటకలో బీఆర్ఎస్ ప్రస్తావనే లేదు. కనీసం కుమారస్వామి పార్టీకి మద్దతు అయినా ఇంకా ప్రకటించలేదు.

ఎన్నికల ఏడాది బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటానికి ఇతర పార్టీలు రెడీ అవుతున్నాయి. వారందర్నీ కలిపపడానికి బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. కానీ కేసీఆర్ వారిని కలిసేందుకు కూడా ఆసక్తి చూపించడం లేదు. పరిస్థితి చూస్తూంటే కేసీఆర్ యుద్ధంలోకి దిగకుండానే ఓటమి ఒప్పుకున్నట్లుగా ఉందన్న అభిప్రాయం ఆయన మౌనం వల్ల వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close