మహిళలకు ఆస్తి హక్కు : నాటి ఎన్టీఆర్ నిర్ణయం .. ఇప్పుడు సుప్రీం తీర్పు..!

కొడుకైనా… కూతురైనా ఒక్కటే… ఇద్దరికీ ఆస్తిలో వాటా దక్కాల్సిందే… తండ్రి జీవించి ఉన్నా లేకపోయినా… కూతురు జీవించి ఉన్నా లేకపోయినా ఆస్థిలో కూతురుకు వాటా ఇవ్వాల్సందే… సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు సారాంశం ఇది. కుమార్తెలకు వారసత్వంగా ఆస్తిని పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తండ్రి జీవించి ఉన్నప్పటికీ.. లేనప్పటికీ.. ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని తేల్చి చెప్పింది. కుమారులతో సమానంగా కుమార్తెలకు ఆస్తిలో వాటా ఉంటుందని తెలిపింది.

2005లో హిందూ వారసత్వ చట్టం-1956లో సవరణలు చేశారు. సవరణలతో కూడిన చట్టాన్ని 2005 సెప్టెంబర్ 9వ తేదీన పార్లమెంట్ ఆమోదించింది. తండ్రి సంపాదించిన ఆస్తిలో కుమార్తెలకు సమాన హక్కు ఉంటుందని ఇందులో పొందుపరిచారు. 1956 నాటి హిందూ వారసత్వ చట్టంలో సవరణలు చేపట్టే నాటికి కుటుంబంలో ఆడపిల్ల పుట్టినా, పుట్టకపోయినా.. ఈ సవరణ వర్తిస్తుందని స్పష్టం చేసింది. దీనికి ఎలాంటి కొలమానం లేదని స్పష్టం చేసింది. కుమార్తెకి ఆస్తి హక్కుపై భిన్న వాదనలను సుప్రీంకోర్టు తెర దించింది. ఇంట్లో ఆడపిల్ల ఉంటే చాలు.. ఆస్తిలో సమాన హక్కు ఉంటుందంటూ తాజాగా స్పష్టం చేసింది.

1980ల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు సమాన ఆస్తి హక్కును కల్పిస్తూ ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఇది అమలవుతోంది. కుటుంబ పరంగా.. అందరూ కలిసి వివాదాల్లేకుండా ఆస్తులు పంచుకుంటూ వస్తున్నారు. ఎక్కడైనా వివాదాలు ఏర్పడితే న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. అక్కడ కుమార్తెలకూ .. హక్కులు దక్కుతున్నాయి. ఇప్పుడు… అన్నింటిలోనూ సగం అంటున్న మహిళాలోకానికి ఇప్పుడు ఆస్తిలోనూ సగం అని.. సుప్రీంకోర్టు అభయం ఇచ్చేసినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వెంకయ్యనాయుడికి కరోనా ..!

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా సోకింది. అతి స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆయన కరోనా పరీక్ష చేయించుకున్నారు. దాంతో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతానికి హోమ్ ఐసోలేషన్‌లోనే వెంకయ్యనాయుడు ఉన్నారు. లక్షణాలు పెరిగితే...

‘ఆదిపురుష్`’పై అనుష్క క్లారిటీ

ప్ర‌భాస్ న‌టిస్తున్న మ‌రో బ‌హుళ భాషా చిత్రం `ఆది పురుష్‌`. రావ‌ణుడి పాత్ర‌కు సైఫ్ అలీఖాన్‌ని ఎంచుకున్నారు. సీత పాత్ర కోసం చాలామంది క‌థానాయిక‌ల పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. అందులో అనుష్క పేరు...

గ్యాప్ రాలేదు.. తీసుకున్నా: అనుష్క

బాహుబ‌లి త‌ర‌వాత‌.. అనుష్క మ‌రీ న‌ల్ల‌పూస అయిపోయింది. `భాగ‌మ‌తి` త‌ప్ప మ‌రే సినిమా ఒప్పుకోలేదు. నిశ్శ‌బ్దం.. సినిమాకి దాదాపుగా రెండేళ్లు కేటాయించాల్సివ‌చ్చింది. అనుష్క‌కి సినిమా అవ‌కాశాలు లేవా? వ‌చ్చినా చేయ‌డం లేదా?...

సోనూసూద్‌కి ఐరాస పుర‌స్కారం

నటుడు సోనూసూద్ కు అరుదైన పురస్కారం ప్ర‌క‌టించింది ఐక్య‌రాజ్య స‌మితి. ఐరాస అనుబంధ సంస్థ‌ యునైటెడ్‌ నేషన్స్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యుఎన్‌డిపి) స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ యాక్షన్ అవార్డుని ఈ యేట...

HOT NEWS

[X] Close
[X] Close