హీరోయిన్ ద‌ర్శ‌క‌త్వం

హీరోల‌కు ద‌ర్శ‌కులుగా మారాల‌ని ఉంటుంది. ఎందుకంటే.. చాలా వ‌ర‌కూ.. స‌హాయ ద‌ర్శ‌కులుగా ప‌నిచేసి వ‌చ్చిన‌వాళ్లు ఎక్కువ‌గా క‌నిపిస్తారు. క‌థ‌ల విష‌యంలో వాళ్ల‌కు ప‌ట్టుఉంటుంది. అందుకే.. ఒక్క‌సారైనా మెగాఫోన్ ప‌ట్టాల‌ని అనుకుంటారు. క‌థానాయిక‌లు అలా కాదు. వ‌చ్చామా? డ‌బ్బులు సంపాదించుకున్నామా? వెళ్లిపోయామా? అనుకుంటారు. క‌నీసం.. ప్రొడ‌క్ష‌న్‌లో కూడా దిగ‌రు. అది ఇంకా రిస్క్ అని వాళ్ల‌కు తెలుసు. కానీ.. కొంత‌మంది క‌థానాయిక‌లు అలా కాదు. మ‌న‌సులో `ద‌ర్శ‌క‌త్వ‌` ఆలోచ‌న బ‌లంగా ముద్ర వేసుకుని ఉంటుంది. నిత్య‌మీన‌న్ కి మెగాఫోన్ ప‌ట్టాల‌ని క‌ల‌. అందుకు ప్లానింగ్ కూడా చేస్తోంది.

ఇప్పుడు అదే బాట‌లో నివేదా థామ‌స్ ప‌య‌నించ‌బోతోంది. నిన్నుకోరి, జెంటిల్‌మెన్ లాంటి సినిమాల‌తో ఆక‌ట్టుకుంది నివేదా. ఇప్పుడు.. `వి`లోనూ నటించింది. త్వ‌ర‌లోనే దర్శ‌క‌త్వం వ‌హించాల‌ని భావిస్తోంద‌ట‌. “ద‌ర్శ‌క‌త్వం అన్న‌ది నా క‌ల‌. ఎప్ప‌టికైనా మెగాఫోన్ ప‌డ‌తాను. అందులోని మెళ‌కువ‌ల‌పై దృష్టి పెడుతున్నా“ అంటోంది నివేదా. కాక‌పోతే మ‌రో రెండు మూడేళ్లు కేవ‌లం న‌టన‌పైనే దృష్టి పెట్టాల‌నుకుంటోంద‌ట‌. ఆ త‌ర‌వాతే కెప్టెన్ కుర్చీలో కూర్చుంటుంద‌ట‌. మ‌రి… నివేదా ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ ఎలా ఉంటుందో తెలియాలంటే అప్ప‌టి వ‌ర‌కూ ఆగాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జనసైనికుల్ని రెచ్చగొట్టేందుకు వైసీపీ దింపుడు కళ్లెం ఆశలు !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం పూర్తయింది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఏ సీట్లలో పోటీ చేయాలో కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే పవన్ 24 సీట్లే తీసుకున్నారంటూ.....

విచారణకు రాను – సీబీఐకి కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు తాను హాజరు కావడం లేదని సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి...

మళ్లీ ఉద్యోగుల పోరాటం ప్రభుత్వానికి తాకట్టు !

ఎన్నికలకు ముందు ఉద్యోగ నేతలు ఆందోళనలు అంటూ హడావుడి చేశారు. కానీ అదంతా స్క్రిప్టెడ్ అని.. ఏమీ చేయకపోయినా ఏదో ఇచ్చినట్లుగా హడావుడి చేయడానికని మొదటి నుంచి అనుమానాలుననాయి. ఇప్పుడు అదే నిజం...

అభిప్రాయం : జనసేన శ్రేణుల అంతర్మధనం

2024 ఎన్నికల రాజకీయ వేడి రాజకుంది. తెలుగు దేశం పార్టీజనసేన కలిసి ఏర్పాటు చేసుకున్న పొత్తు లో భాగం గా జనసేన 24 ఎమ్మెల్యే సీట్ల లో పోటీ చేస్తుందని చంద్రబాబు -పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close