వైకాపా అవిశ్వాసానికి ‘తెదేపా మార్క్’ వ్యూహంతో చెక్

తెదేపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైకాపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి తెదేపా తనదైన శైలిలో ఎదురుదెబ్బ తీసి కంగు తినిపించింది. అదిచ్చిన నోటీసును స్వీకరించిన స్పీకర్ కోడెల శివప్రసాద రావు, వెంటనే బి.ఏ.సి. సమావేశం నిర్వహించేరు. దానిలో అధికార పార్టీ, దాని మిత్రపక్షమయిన భాజపా సభ్యులదే పైచెయ్యిగా ఉంటుంది కనుక వారు దానిపై తక్షణమే సభలో చర్చ మొదలుపెట్టాలని నిర్ణయించారు. ఆవిధంగా చేయడం ద్వారా వైకాపా తన పార్టీ ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేయడం సాధ్యం కాదు కనుక ఆ పార్టీలో నుంచి ఇటీవల తెదేపాలోకి మారిన తమ 8మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయమని కోరే అవకాశం వైకాపా కోల్పోయింది. ఊహంచని ఈ ఎత్తుగడకి వైకాపా కంగు తింది. ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత రెడ్డి అందుకు తెదేపాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ “మా పార్టీ ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేసే అవకాశం లేకుండా చేయదానికే తెదేపా ఈ చవకబారు ఎత్తుగడ వేసిందని అర్ధమవుతూనే ఉంది. తద్వారా తెదేపాలో చేరిన మా పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా కాపాడుకోవాలని తెదేపా తాపత్రయపడుతోంది. శాసనసభ చరిత్రలో ఇంత అనైతికంగా, అప్రజాస్వామికంగా నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి. తెదేపా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అన్ని విధాలుగా ఖూనీ చేస్తూ పరిపాలన సాగిస్తోంది,” అని విమర్శించారు.

ఆ పార్టీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింటు దగ్గర మాట్లాడుతూ “తెదేపా ఇటువంటి చవకబారు ఎత్తులు వేస్తుందని మేము ముందే ఊహించాము. అందుకే మేము నిన్న సాయంత్రమే మా పార్టీ ఎమ్మెల్యేలందరికీ ఎస్.ఎం.ఎస్. ఈ.మెయిల్, టెలిగ్రాం వంటి ఇతర మార్గాల ద్వారా విప్ జారీ చేసాము,” అని చెప్పారు.

తెదేపా ఆవిధంగా వ్యవహరించడం చాలా తప్పేనని చెప్పవచ్చును. దీనిపై వైకాపా ఆవేదన చూస్తే అది అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం వెనుక దాని అసలు ఉద్దేశ్యం కూడా వారి నోటితో వారే స్వయంగా బయటపెట్టుకొన్నట్లయింది. రాష్ట్ర ప్రజలు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారనే ఉద్దేశ్యంతోనే తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టమని వైకాపా నేతలు చెప్పుకొన్నారు. కానీ ఆ సాకుతో తెదేపాలో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేలకి విప్ జారీ చేసి, వారిపై అనర్హత వేటు పడేల చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు వారే స్వయంగా చాటుకొన్నట్లయింది. ఒకే దెబ్బకు రెండు వీలయితే ఇంకా ఎక్కువ పిట్టలు కొట్టేయాలని ప్రయత్నించి భంగపడుతుంటం జగన్మోహన్ రెడ్డికి అలవాటే కనుక మళ్ళీ ఇప్పుడు కూడా మరోసారి భంగాపడ్డారని సరిపెట్టుకోవలసి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పుష్ప రిలీజ్ డేట్‌…. త‌గ్గేదే లే!

డిసెంబ‌రులో పెద్ద సినిమాల జాత‌ర రాబోతోంది. అఖండ‌తో డిసెంబ‌రు జోరు మొద‌లు కాబోతోంది. డిసెంబ‌రు 17న పుష్ప‌, ఆ త‌ర‌వాత శ్యాం సింగ‌రాయ్ రాబోతున్నాయి. అయితే పుష్ప రిలీజ్‌కొంచెం క‌ష్ట‌మ‌ని, డేట్ మారే...

జాతీయ అవార్డు గ్ర‌హీత‌.. శివ శంక‌ర్ మాస్ట‌ర్ మృతి

తెలుగు చిత్ర‌సీమ మ‌రో ప్ర‌తిభావంతుడ్ని కోల్పోయింది. క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రో క‌ళాకారుడ్ని బ‌లి తీసుకుంది. ప్ర‌ముఖ నృత్య ద‌ర్శ‌కుడు శివ శంక‌ర్ మాస్ట‌ర్ ఈరోజు తుది శ్వాస విడిచారు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న...

దేశంలో ఇక “ఒమిక్రాన్” అలజడి !

కేంద్ర ప్రభుత్వం ఒమిక్రాన్ విషయంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్న విమానాల విషయంలో మాత్రం ఆంక్షలు విధించలేదు. ఇప్పటికే ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు బయటపడిన దేశాల నుంచి...

సీఎస్‌గా సమీర్ శర్మ మరో ఆరు నెలలు !

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆరు నెలల పొడిగింపు ఇచ్చింది. బెంగాల్‌లో చీఫ్ సెక్రటరీ పొడిగింపు వ్యవహారం వివాదాస్పదం కావడంతో ఇక ఏ రాష్ట్రంలోనూ చీఫ్ సెక్రటరీల...

HOT NEWS

[X] Close
[X] Close