ప‌వ‌న్ సినిమా.. ఏమిటీ లేటు?

మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన `అయ్యప్ప‌యుమ్ కోషియ‌మ్‌`ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌కుడు. ఓ క‌థానాయ‌కుడిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫిక్స‌య్యాడు. రెండో నాయ‌కుడి పాత్ర‌లో రానా క‌నిపిస్తాడ‌ని ముందు నుంచీ ప్ర‌చారం జరుగుతోంది. అయితే చిత్ర‌బృందం ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. ఈరోజు రానా పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌.. రానా ఎంట్రీ గురించిన అఫీషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ వ‌స్తుంద‌ని ఆశించారంతా. కానీ.. అలాంటి ప్ర‌క‌ట‌న ఏదీ రాలేదు.

నిజానికి రానా పుట్టిన రోజు కంటే.. బెట‌ర్ అకేష‌న్ ఏదీ సితార‌కు లేదు. రానా ఎంట్రీ గురించి క్లారిటీ ఇవ్వ‌డానికి. కానీ.. ఈరోజూ.. అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసే విష‌యంలో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ మొగ్గు చూపించ‌లేదు. దాంతో.. అస‌లు ఈ రీమేక్ లో రానా ఉన్నాడా, లేడా? అనే అనుమానాలు మ‌రోసారి రేకెత్తాయి. రానా న‌టించే సినిమాల‌న్నింటికీ.. సురేష్ బాబు భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రించ‌డం ఆన‌వాయితీగా మారుతోంది. రానా ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇస్తే, ప్రొడ‌క్ష‌న్ ప‌రంగానూ సురేష్ బాబు వాటాకి వ‌స్తాడు. ఆ విష‌యంలోనే సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ తో ఇంకా సంప్ర‌దింపులు జ‌రుగుతున్నాయ‌ని టాక్‌. ఈ వ్య‌వ‌హారాల‌న్నీ ఓ కొలిక్కి రానందువ‌ల్లే.. రానా పేరు ఇంకా ప్ర‌క‌టించ‌లేద‌ని తెలుస్తోంది. `వ‌కీల్ సాబ్` అవ్వ‌గానే మొద‌ల‌వ్వాల్సిన సినిమా ఇది. మ‌రి ఈ జాప్యం ఏమిటో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ మంచోడంటున్న నాగబాబు..!

విక్రమార్కుడు సినిమాలో  ఓ సీన్ ఉంటుంది. ఓ పోలీస్ అధికారి భార్యను ఆ ఊరిలో అధికారం చెలాయించే పెద్ద మనిషి కొడుకు ఎత్తుకొచ్చి శారీరక కోరికలు తీర్చుకుంటూ ఉంటాడు.  తన భార్య అక్కడే...

ఇక బీజేపీకి పవన్ ప్రచారం లేనట్టే..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండో విడత ప్రచారానికి వస్తారని ఆశలు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ నేతలకు క్వారంటైన్ షాక్ తగిలింది. తన వ్యక్తిగత, భద్రతా సిబ్బందికి కరోనా సోకినట్లుగా తేలడంతో...

ఆ వీడియో చూపించారని దేవినేని ఉమపై కేసు..!

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతలపై కేసులు పెట్టడం సహజమే. ముఖ్యంగా సీఐడీ పోలీసులు ఆ విషయంలో చాలా ముందు ఉంటారు. ఎవరో చెబుతున్నట్లుగా చిత్ర విచిత్రమైన కేసులు పెడుతూ ఉంటారు. తాజాగా మాజీ మంత్రి...

జగన్ నిర్ణయాలను తానే తీసుకుంటున్న పెద్దిరెడ్డి..!

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో జగన్ తర్వాత తానే పవర్ ఫుల్ అని చెప్పాలనుకుంటున్నారో.. జగన్ కన్నా తానే పవర్ ఫుల్ అని చెప్పాలనుకుంటున్నారో కానీ... అప్పుడప్పుడూ... కాస్త తేడా ప్రకటనలు చేస్తున్నారు....

HOT NEWS

[X] Close
[X] Close