‘ఎఫ్ 3’లో…. 3వ హీరో ఉన్న‌ట్టా? లేన‌ట్టా?

తెలుగునాట వంద కోట్లు సాధించిన సినిమాల్లో `ఎఫ్ 2` ఒక‌టి. దీనికి సీక్వెల్ గా `ఎఫ్ 3` రాబోతోంది. ఈ నెల‌లోనే ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. అయితే ఈ సినిమాలో హీరోలెంత‌మంద‌న్నది ప్ర‌శ్న‌. ఎఫ్ 2లో వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ లు `కోబ్రా`లుగా న‌టించారు. ఎఫ్ 3లో ముగ్గురు హీరోలుంటార‌ని ముందు నుంచీ చెబుతూనే వ‌చ్చారు. ఎఫ్ 3లో ర‌వితేజ న‌టిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఓ ద‌శ‌లో మ‌హేష్ బాబు పేరు కూడా వినిపించింది. సునీల్ అని కూడా అనుకున్నారు. ఇప్పుడు గోపీచంద్ పేరు మ‌ళ్లీ వార్త‌ల్లో వినిపిస్తోంది.

అయితే… ఈ సినిమాలో మూడో హీరోకి చోటు లేద‌ని తేలిపోయింది. ఈసారి కూడా వెంకీ, వరుణ్‌లే క‌నిపిస్తారు. ఎఫ్ 3 కోసం అనిల్ రావిపూడి రాసుకున్న స్క్రిప్టులో మ‌రో కీల‌క‌మైన పాత్ర వుంది. అందులో హీరోనే న‌టించాలి. కానీ.. ఇప్పుడు దాన్ని తొల‌గించార‌ని స‌మాచారం. ఆ స్థానంలో ఓ మాజీ హీరోయిన్ ని రంగంలోకి దింపాల‌ని చూస్తున్నార్ట‌. విజ‌య‌శాంతి, రోజాలు చేయాల్సిన పాత్ర అద‌ని, ఓ ర‌కంగా ఆ పాత్రే మూడో హీరో అని తెలుస్తోంది. మూడో హీరోని దూరం పెట్ట‌డానికి కార‌ణం… బ‌డ్జెట్ ప‌రిమితులే. మూడో హీరో వ‌స్తే.. ఈ సినిమా బ‌డ్జెట్ మ‌రింత పెరుగుతుంది. అందుకే… ఆ పాత్ర‌ని ఇలా మార్చాల్సివ‌చ్చింది. అయితే ఈ సినిమాలో మాత్రం నలుగురైదుగురు హీరోయిన్లు క‌నిపిస్తార‌ని స‌మాచారం. ఓ ప్ర‌త్యేక గీతం కూడా ఉండ‌బోతోంద‌ని, అందులోనూ ఐటెమ్ గాళ్ గా ఓ ప్ర‌ముఖ‌ హీరోయినే మెర‌వ‌నుంద‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రమేష్ ఆస్పత్రికి రఘురామ..! హైకోర్టు ఆదేశాలనైనా పాటిస్తారా..?

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అయినా రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించకూడదనుకున్న సీఐడీ అధికారులు.. ప్రభుత్వానికి షాక్ తగిలింది. సీఐడీ కోర్టు ఆదేశించించినట్లుగానే.. రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించాలని స్పష్టం చేసింది. గుంంటూరు ప్రభుత్వాసుపత్రిలో...

జైలుకు ఆర్ఆర్ఆర్.. కోర్టును లైట్ తీసుకున్న సీఐడీ..!

ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కోర్టులను లెక్క చేయలేదు. ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్యం అందించాలని ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేసి.. జిల్లా జైలుకు తరలించేశారు. ఆయనకు వైద్యం అందించే విషయంలోనే కాదు.. వైద్య నివేదిక...

టీవీ9 ప్రాథమిక నివేదిక.. ఆర్ఆర్ఆర్‌కి సొరియాసిస్..!

రఘురామకృష్ణరాజు కాళ్లకు ఉన్న దెబ్బల గురించి టెస్టులు చేసి నివేదిక ఇవ్వాలని సీఐడీ కోర్టు.. హైకోర్టులు ఆదేశించాయి. వైద్యులు నివేదికల కోసం.. కోర్టు ఇచ్చిన సమయం దాటి మరీ టెస్టులు చేస్తున్నారు. నివేదికలు...

రేవంత్‌కు పోలీసులే అలా ప్రచారం చేసి పెడతారు..!

హైదరాబాద్‌లో రూ. ఐదు రూపాయల భోజన కేంద్రాలయిన అన్నపూర్ణ క్యాంటీన్లు కొనసాగుతాయని మీడియాకు సమాచారం ఇచ్చిన తెలంగాణ సర్కార్.. నిజానికి ఆపేసింది. దాంతో పేదలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలా చోట్ల టీఆర్ఎస్...

HOT NEWS

[X] Close
[X] Close