ప్ర‌భాస్ – నాగ అశ్విన్.. కాస్త ఆల‌స్యం!

ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా వైజ‌యంతీ మూవీస్ ఓ భారీ చిత్రాన్ని నిర్మించాల‌ని ప్లాన్ చేసింది. నాగ అశ్విన్ ద‌ర్శ‌కుడు. స్క్రిప్టు ప‌నులు ఎప్పుడో మొద‌లైపోయాయి. ఈ అక్టోబ‌రులో షూటింగ్ ప్రారంభించాల‌నుకున్నారు. అయితే.. ఇప్పుడు ఆ ఆలోచ‌న‌ని ప‌క్క‌న పెట్టారు. క‌రోనా- లాక్ డౌన్ ప్ర‌భావంతో షూటింగుల‌న్నీ ఆగిపోయాయి. ఒక వేళ మొద‌లెట్టినా – ప్ర‌తిక్ష‌ణం భ‌యం భ‌యంతో సెట్లో గ‌డ‌పాలి. పైగా.. ప్ర‌భాస్ దృష్టి ఇప్పుడు `రాధే శ్యామ‌`పైనే ఉంది. అది పూర్తయ్యాకే నాగ అశ్విన్ సినిమా మొద‌ల‌వుతుంది. 2021 మార్చి – ఏప్రిల్‌లలో నాగ అశ్విన్ సినిమా మొద‌ల‌య్యే ఛాన్సుంది. ప్రస్తుతానికి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్ని సైతం ప‌క్క‌న పెట్టేసిన‌ట్టు తెలుస్తోంది. 250 కోట్ల‌పై చిలుకు బ‌డ్జెట్ తో ముడి పడి ఉన్న ప్రాజెక్టు ఇది. హ‌డావుడిగా మొద‌లెట్టడానికి ఛాన్సు లేదు. అందుకే…ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డిన త‌ర‌వాతే.. ఈ సినిమా గురించి ఆలోచించాల‌ని అశ్వ‌నీద‌త్‌, నాగ అశ్విన్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌భాస్ కూడా…. ఈ ప్రాజెక్టు విష‌యంలో ఏమాత్రం తొంద‌ర ప‌డ‌డం లేద‌ని తెలుస్తోంది. బుర్రా సాయి మాధ‌వ్ ఈ చిత్రానికి సంభాష‌ణ‌లు అందిస్తున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న త‌న ప‌ని పూర్తి చేశారు. సెట్ వ‌ర్క్‌కి సంబంధించి చాలా ప‌ని ఉంది. ఆగ‌స్టులో సెట్స్ నిర్మాణం మొద‌లెట్టాల‌ని అనుకున్నారు. కానీ.. ఇప్పుడు ఆ ప‌నులు కూడా వాయిదా వేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close