‘దిల్ బెచారా’ ట్రైల‌ర్‌: ల‌వ్ అండ్ ఎమోష‌నల్ జ‌ర్నీ

హిందీ సినిమాల‌కు ఎక్క‌డైనా మార్కెట్ ఉంటుంది. షారుఖ్‌, స‌ల్మాన్‌, అమీర్‌, హృతిక్ సినిమాల‌కే కాదు.. యంగ్ హీరోల సినిమాల‌కూ క్రేజే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివ‌రి సినిమా గురించి కూడా అంత‌టా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. సుశాంత్ చివ‌రి సినిమా `దిల్ బెచారా` ఇప్పుడు ఓటీటీలో విడుద‌ల కాబోతోంది. ఈనెల 24న హాట్ స్టార్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. ట్రైల‌ర్ ఈరోజు విడుద‌ల చేశారు.

`ద ఫాల్ట్ ఇన్ అవ‌ర్ స్టార్స్‌` అనే ఓ న‌వ‌ల ఆధారంగా తెర‌కెక్కిన చిత్ర‌మిది. కాన్స‌ర్ తో బాధ ప‌డుతున్న ఓ అమ్మాయిని, ఓ అబ్బాయి ప్రేమిస్తే ఎలా ఉంటుంద‌న్న‌ది క‌థ‌. ట్రైల‌ర్‌లో చిన్న చిన్న మూమోంట్స్‌, సున్నిత‌మైన భావోద్వేగాలూ, ఎమోష‌న్స్ ఇవ‌న్నీ.. చ‌క్క‌గా ప‌లించాడు ద‌ర్శ‌కుడు. ఇదో ఎమోష‌న‌ల్ ల‌వ్ స్టోరీ అనే సంగ‌తి అర్థ‌మ‌వుతోంది. `గీతాంజ‌లి` మూడ్ అక్క‌డ‌క్క‌డా క‌నిపిస్తే… అది మ‌న త‌ప్పేం కాదు. ఓ అల్ల‌రి అబ్బాయి, చావుకి ద‌గ్గ‌ర‌వుతున్న అమ్మాయి – ఇంత‌కంటే ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీ ఎక్క‌డ దొరుకుతుంది. దానికి కాస్త ఎంట‌ర్‌టైన్‌మెంట్ జోడించి ఈ సినిమాని తీశారు. రెహ‌మాన్ పాట‌లు, ఇచ్చిన ఆర్‌.ఆర్‌.. ఈ చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌బోతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చెప్పిన డైలాగ్‌.. క‌చ్చితంగా అత‌ని అభిమానుల‌కు కంట‌త‌డి పెట్టిస్తుంది. `ఎప్పుడు పుడ‌తామో, ఎప్పుడు పోతామో మ‌నం నిర్ణ‌యించ‌లేం.. కానీ.. ఎలా బ‌త‌కాల‌న్ని మ‌నం నిర్ణ‌యించుకోగ‌లం` అనే మాట‌లు – చ‌నిపోయేట‌ప్పుడు కూడా సుశాంత్ గుర్తు పెట్టుకుంటే బాగుండేది. మొత్తానికి.. ఓ మంచి ల‌వ్ స్టోరీ చూడ‌బోతున్నాం అనే ఫీలింగ్ అయితే తెచ్చిందీ ట్రైల‌ర్‌. మరి సినిమా ఉలా ఉంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.