ఎల్జీ పాలిమర్స్‌పై హైపవర్ కమిటీ రిపోర్ట్ : అన్నీ తెలిసినవే..!

ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై.. ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ రెండు నెలల తర్వాత నివేదిక సమర్పించింది. ఆ ప్రమాదం జరిగినప్పుడు.. ప్రభుత్వం లైట్ తీసుకుంటోందంటూ తీవ్ర విమర్శలు రావడంతో.. సీనియర్ ఆఫీసర్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆధ్వర్యంలో హైవపర్ కమిటీని నియమించి నెల రోజులు గడువు ఇచ్చారు. ఆ గడువు తర్వాత పెంచుతూ వెళ్లారు. రెండు నెలలు ముగిసిన తర్వాత ఈ రోజు.. ఆ కమిటీ నివేదికను సమర్పించింది. అందులో ప్రమాదంలో ఎలా జరిగింది.. ఎంత మంది చనిపోయారు.. ఎంత మంది ఆస్పత్రి పాలయ్యారు అన్న విషయాలను ప్రస్తావించారు. అలాగే.. ఫోన్ల ద్వారా.. ఈ మెయిల్ ద్వారా ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్‌ను పొందు పరిచారు.

అసలు ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటన పై కమిటీ వేయడానికి ప్రధాన కారణంగా.. ప్రమాదం జరగడానికి ఎవరిది తప్పిదం..? యాజమాన్య నిర్లక్ష్యం ఎంత ఉంది..? మానవతప్పిదమే కారణమా కాదా..? వంటి అంశాలను తేల్చి.. బాధితులకు నష్టం చేయడం. కానీ.. నీరబ్ ప్రసాద్ కమిటీ.. ఎల్జీ యాజమాన్యం జోలికి వెళ్లలేదు. ప్రమాదం జరిగిన సమయంలో సైరన్ మోగలేదు.. రసాయనాల కూలింగ్ సరిగ్గా మెయిన్ టెయిన్ చేయలేదు.. గత ఏడాది పైప్‌లను మర్చారని వాటి మెయిన్‌టనెన్స్ సరిగ్గా లేదని చెప్పుకొచ్చింది. ట్యాంక్ డిజైన్ సరిగ్గా లేకపోవడం… సిబ్బందికి అవగాహన లేకపోవడం వంటి కారణాలను కూడా కమిటీ గుర్తించింది. అయితే.. వీటన్నింటి వెనుక.. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వి,యాన్ని మాత్రం నేరుగా.. కమిటీ చెప్పలేదు.

అంతే కాదు.. అసలు ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగిన తర్వాత.. అసలు అనుమతులు ఎలా వచ్చాయి..? అనుతులు ఉన్నాయా లేదా..? అనుమతి లేకుండా ఫ్యాక్టరీ ఉత్పాదక కార్యకలాపాలకు ఎవరు అనుమతి ఇచ్చారు..? అసలు స్టైరిన్ ఎలా తీసుకు వచ్చారు..? లాంటి అనేక అనుమానాలు బయటకు వచ్చాయి. అంతిమంగా.. స్టైరిన్ ఉత్పత్తులకు ఆ సంస్థకు పర్మిషన్లు లేవని తేలింది. ఈ అనుమతుల గురించి.. నీరబ్ కుమార్ ప్రసాద్ కమిటీ ఎక్కడా ప్రస్తావించిటన్లుగా చెప్పలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందని.. నేరుగా ప్రకటించారు. వాటిపై.. టీడీపీ కొన్ని పత్రాలు విడుదల చేసింది. ప్రస్తుత ప్రభుత్వమే.. అనుమతులు ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేసిందని.. అది కేంద్రం ఇవ్వక ముందే ఉత్పత్తి ప్రారంభించడానికి .. లోపాయికారీగా అంగీకరించారని దాని వల్లనే ప్రమాదం జరిగిందని ఆరోపమలు గుప్పించింది. ఈ అనుమతల అంశం.. నీరబ్ కుమార్ కుమార్ కమిటీ వివరించారు.

ఎల్జీ పాలిమర్స్ విషయంలో.. ఏపీ సర్కార్ మొదటి నుంచి మెతక ధోరణి అవలంభిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వం తరపునే పరిహారం చెల్లించారు కానీ.. కంపెనీ నుంచి ఎలాంటి పరిహారం ఇప్పించలేదు. పైగా.. కంపెనీ తరపున.. ప్రభుత్వం సేవలు పొందే లాయర్ సుప్రంకోర్టులో వాదించడంతో… ఏదో ములాఖత్ ఉందన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. దానికి తగ్గట్లుగానే ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం జోలికి వెళ్లకుండా.. నీరబ్ కుమార్ కమిటీ నివేదిక ఇచ్చిందనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి… హైపవర్ కమిటీ నివేదిక ఆదారంగా… ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని చెబుతూ వస్తున్నారు. మరి ఈ కమిటీ నివేదిక ప్రకారం ఏం చర్యలు తీసుకుంటారోనన్న ఆసక్తి.. రాజకీయవర్గాల్లో ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close