‘ఆంధ్రా కింగ్ తాలుకా’ తరవాత రామ్ సినిమా ఎప్పుడు, ఎవరితో అనే సందిగ్థతకు తెరపడింది. మే 15 రామ్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. రామ్ దర్శకత్వంలోనే ఈ సినిమా పట్టాలెక్కడం విశేషం. రామ్ రాసుకొన్న ఓ కథని తానే డైరెక్ట్ చేస్తూ, సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. ఇదో యాక్షన్ థ్రిల్లర్. ఆల్రెడీ స్క్రిప్టు పనులు అయిపోయాయి. ఇప్పుడు నటీనటులు, మిగిలిన సాంకేతిక నిపుణుల్ని ఎంచుకోవడమే తరువాయి.
ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం ఎస్.జె.సూర్యని ఎంచుకొన్నట్టు తెలుస్తోంది. ముందుగా ఈ పాత్ర కోసం ఫహద్ ఫాజిల్ ని అనుకొన్నారు. ఆయనతో సంప్రదింపులు కూడా జరిపారు. కానీ ఇప్పుడు సూర్య వైపు చూస్తున్నారు. సూర్య పారితోషికం దాదాపు రూ.5 కోట్లు. ఈ విషయంలోనే బేరసారాలు సాగుతున్నాయి. పారితోషికం విషయంలో ఓ మాట అనేసుకొంటే, సూర్య ఈ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చేసినట్టే. కథానాయిక గా శ్రీనిధి శెట్టి పేరు పరిశీలనలో ఉంది. ఇప్పటి వరకూ రామ్, శ్రీనిధి కలిసి నటించలేదు. కాబట్టి ఈ జంట కొత్తగా అనిపించే ఛాన్స్ వుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలెడతారు. ఈలోగా.. టీమ్ ఫిక్స్ చేసుకోవాల్సివుంది.