ఢిల్లీ `కార్ పాలసీ’; తొలిరోజునే బిజెపీ ఎంపీ ఉల్లంఘన !

కాలుష్యాన్ని తగ్గించాలన్న తపనతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఢిల్లీలో ప్రారంభమైన `ఆడ్ – ఈవెన్ నెంబర్’ కార్ రన్ పాలసీని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపీకి చెందిన పార్లమెంట్ సభ్యుడే ఉల్లంఘించారు. అది కూడా తొలి రోజునే. నూతన సంవత్సరం ఆరంభం (జనవరి 1) నుంచి ఓ 15రోజులపాటు ఈ కార్ రన్ పాలసీని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.

ఈ పాలసీ ప్రకారం తొలిరోజున ఆడ్ నెంబర్ (బేసి సంఖ్య) నెంబర్ ప్లేట్ చివర్లో ఉంటేనే ప్రైవేట్ వాహనాను రన్ చేయాల్సిన పరిస్థితి. అయితే, బిజెపీ లోక్ సభ సభ్యుడు, మాజీ పోలీస్ కమిషనర్ సత్యపాల్ సింగ్ కు ఈ రూల్ తెలియదనుకోవాలో, లేక పట్టించుకోలేదనుకోవాలోగానీ, అందుకు విరుద్ధంగా సరి సంఖ్యతో ముగిసే నెంబర్ ప్లేట్ ఉన్న కారుఎక్కి రోడ్డుమీదకు తీసుకొచ్చారు. కార్ పొల్యూషన్ ను తగ్గించడం కోసం 15రోజుల పాటు ట్రయిల్ రన్ గా ఈ పాలసీని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాళ్టి నుంచే అమల్లోకి తీసుకువచ్చింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీ అయిన సత్యపాల్ సింగ్ తీసిన కారు నెంబర్ ప్లేట్ పై DL #CBX2186 గా ఉంది. అంటే, చివర్లో సరి (ఈవెన్) నెంబర్ ఉందన్నమాట. దీంతో ఇండియా గేట్ వద్ద ట్రాఫిక్ పోలీసులు ఈ కారును ఆపారు. `ఆడ్ అండ్ ఈవెన్ నెంబర్ కార్ పాలసీ’ని ఈ విధంగా మాజీ పోలీస్ అధికారే ఉల్లంఘించడం గమనార్హం. ఈయన గతంలో ముంబయి పోలీస్ కమిషనర్ గా పనిచేశారు. ఈ కారుపై బిజెపీ పార్టీ జెండా ఉంది. దీంతో ఇది అధికారికంగా వాడే కారుకాదని, పార్టీ పరంగా ప్రైవేట్ గా వాడేదని పోలీసులు చెబుతున్నారు.

odd-even

ప్రయోగాత్మకంగా 15 రోజుల పాటు ప్రైవేట్ కార్లపై ఈ విధానం అమల్లో ఉంటుంది. ఇవ్వాళ తొలిరోజున బేసి సంఖ్య (ఆడ్ నెంబర్) ఉన్న ప్రైవేట్ వాహనాలే రోడ్డెక్కాలి. ప్రజాప్రతినిధే రూల్ ఉల్లంఘించడంతో ఏం చేయాలో తెలియని ట్రాఫిక్ పోలీస్ ఛలానా మాత్రం రాయకుండా, అవగాహన పత్రాన్ని మాత్రం చేతిలో పెట్టినట్లు తెలిసింది. అదే మాములుగా అయితే, మోటార్ వాహనాల చట్టం ప్రకారం రెండువేల దాకా జరిమానా విధించే అవకాశం ఉంది.

ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుంది. దీన్ని వెంటనే అదుపుచేయాలంటూ సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచించిన సురక్షిత రేఖను ఢిల్లీ ఏనాడో దాటింది. డబ్ల్యూహెచ్ఓ సూచించిన దానికంటే పదిరెట్లు హెచ్చుగా దేశ రాజధానిలో కాలుష్యం పెరుకుపోయింది. 2014లో డబ్ల్యూహెచ్ఓ చేసిన 16వందల నగరాల్లోని కాలుష్యంపై సర్వే చేస్తే ఢిల్లీ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తేలింది. కాలుష్యం పెరగడంలో 85లక్షల వాహనాలు రోడ్లమీద తిరగడం కూడా ఒక కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చిచెప్పింది.

ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి సంచలనాత్మకంగా `ఆడ్ అండ్ ఈవెన్ కారు పాలసీ’ని తీసుకొచ్చారు. కాలుష్య నివారణ చర్యల్లో దీన్ని తొలి అడుగుగా అభివర్ణిస్తున్నారు. ఈ పాలసీలో మార్పులు చేర్పులు తప్పవని అంటున్నారు. ప్రస్తుతానికి మోటార్ సైకిళ్లను పట్టించుకోలేదు. అయితే, వాహనాల కాలుష్యంలో మోటార్ సైకిళ్లది 31 శాతందాకా ఉన్నదని విమర్శకులు అంటున్నారు.

పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యాన్ని కూడా తగ్గించే దిశగా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతానికి ట్రయిల్ బేస్డ్ గా ఉన్న ఈ కార్ రన్ పాలసీకి ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి తుది నిర్ణయం తీసుకుంటారు. ఢిల్లీలో ప్రస్తుత కాలుష్య స్థాయి ఎంతటి ప్రమాదకరమైనదంటే, ఈ స్థితిలో ఎవ్వరికైనా శ్వాసకోస వ్యాధులు ఇట్టే రావచ్చు. అంతేకాదు, పిల్లలు, వృద్ధులు బయటకు వస్తే ప్రమాదమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇంతటి భయంకరమైన పరిస్థితిని ఏదో ఒక మూల నుంచి సరిచేద్దామని కేజ్రీవాల్ ప్రయత్నిస్తుంటే, బిజెపీ ఎంపీ ఇలా రూల్ ఉల్లంఘించడం ఇప్పుడు వివాదాస్పదమైంది.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close