విశాఖ బాధలు : హిడెన్ స్ప్రౌట్స్ టు లక్ష్మీ అపర్ణ..!

విశాఖలో ఏం జరుగుతోంది..? ఎప్పుడూ ప్రశాంతంగా … ఆహ్లాదంగా.. ఉల్లాసంగా ఉండే నగరం ఇప్పుడు ఎలా ఉంది..? వారాంతం వస్తే.. అందరూ వణికిపోయే పరిస్థితి వచ్చింది. గతంలో పరిస్థితిచేయి దాటుతుంది అనుకుంటే తప్ప… చేయి ఎత్తని పోలీసులు ఇప్పుడు చిన్న చిన్న కారణాలతో.. మహిళలు.. పిల్లలపై విరుచుకుపడే పరిస్థితి ఏర్పడింది. ఒక్క రోజు వ్యవధిలో జరిగిన రెండు ఘటనలు ఇప్పుడు విశాఖ మొత్తం చర్చనీయాంశం అవుతున్నాయి. ఇదేం పరిస్థితి అని అందరూ… భయపడుతున్నారు. ఎలా ఉండాల్సిన విశాఖ ఎలా అయిపోయింది అని కంగారు పడుతున్నారు.

మొదటగా గత శుక్రవారం.. హిడెన్ స్ప్రౌట్స్ అనే స్కూల్‌ను జేసీబీలతో కూల్చేశారు. అది స్కూల్..ఖాళీగా ఉందని… ఆక్రమించారని ఎవరైనా అనుకుంటే పొరపాటు. అది స్కూలే కానీ మామూలు స్కూల్ కాదు. మానసిక వికలాంగుల స్కూల్. లాభాపేక్షతో పెట్టింది కాదు. విధి వంచితులైన పిల్లలకు చదువు చెప్పేందుకు పెట్టిన స్కూల్. ఈ స్కూల్‌ను అందులో పిల్లలు ఉండగానే అధికారులు.. పోలీసు రక్షణతో వచ్చి కూల్చేశారు. దానికి వారు చెప్పిన కారణం లీజు గడువు ముగిసిపోయింది… రెన్యూవల్ చేసుకోలేదని. లీజు గడువు రెన్యూవల్ చేసుకోకపోతే… కూల్చివేస్తారా.. అని అందరూ ముక్కున వేసుకోవాల్సిన పరిస్థితి. ఆ పిల్లల పాపం తగులుతుందని.. కొంత మంది నిస్సహాయాలు ప్రభుత్వానికి శాపం పెట్టారు కానీ..ఇతరులు మాత్రం.. శక్తివంచన లేకుండా తమ వాయిస్ వినిపిస్తున్నాయి. ఈ స్కూల్ నిర్వహణ కోసం సాయం చేసే వ్యక్తుల్లో ఒకరయిన మాజీ క్రికెటర్, చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.. ప్రభుత్వం చేసింది చాలా తప్పుడు పని వీడియో రిలీజ్ చేశారు. ఆ స్కూల్‌ను లీజును కొనసాగించాలని విజయసాయిరెడ్డి, ముఖ్యమంత్రి జగన్‌కు వీడియో సందేశం పంపారు. వారాంతం వస్తే… గతంలో టీడీపీ నేతల ఆస్తులపై విరుచుకుపడేవాళ్లు. ఇప్పుడు.. తాము కబ్జా చేయాలనుకున్న స్థలాలపై పడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అందు కోసం… మానసిక వికలాంగులను రోడ్డుపై పడేయడానికి కూడా సిద్ధపడుతున్నారని మండిపడుతున్నారు.

ఈ గొడవ జరుగుతూండగానే… విశాఖ పోలీసులు.. లక్ష్మి అపర్ణ అనే ఫార్మా ఉద్యోగినితో వ్యవహరించిన విధానం వైరల్ అయింది. పోలీసులు కట్టుదాటిపోయారని…సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. లాక్ డౌన్‌ టైంలో… మెడికల్ షాప్‌లో పని చేస్తున్న ఆమెకు పాస్ ఉంది. కానీ షాప్ నుంచి ఇంటికి వెళ్లేందుకు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లేదు. ఆమెను తీసుకెళ్లేందుకు పరిచయస్తుడు బైక్ మీద వచ్చారు. పాస్ ఉందని చెప్పినా వినకుండా పోలీసులు ఆమె బైక్‌కు ఫైన్ వేశారు. ప్రశ్నించే తత్వం ఉన్న ఆ యువతి.. ఇదేం అన్యాయం అని తిరగబడింది. అంతే.. డాక్టర్ సుధాకర్ ను చేతులు వెనక్కి విరిచికట్టినట్లుగా ఆమెను కట్టడానికి ప్రయత్నించారు. డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ చేయాలని అక్కడే ఉన్న సీఐ రంకేలేశారు. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. పోలీసుల తీరు చూసి.. హవ్వ.. అని అనుకోవడం విశాఖ వాసులే కాదు.. ఏపీ ప్రజల వంతయింది. పోలీసులు వివరణ ఇచ్చినా… వారి వాదన ఎవరూ నమ్మకపోగా… తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.

విశాఖలో వెలుగులోకి వచ్చి మీడియా అటెన్షన్ పొందిన ఘటనలు ఈ రెండు.. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. కానీ.. అధికార అరాచకాలు అడగడుగునా ఉన్నాయని… వాటి వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. అంటున్నారు. ప్రశాంతమైన వైజాగ్ సిటీ ఇప్పుడు… భయంభయంగా ఉంటోందని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శెట్టి బలిజల్ని తిట్టి సారి చెప్పిన జూపూడి !

వైసీపీ నేతలకు కులాలతో ఎలా ఆటలాడుకోవాలో బాగా  స్టడీ చేసి గేమ్ ఆడుతున్నట్లుగా ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా కొన్ని కులాలను కించపర్చడం .. ఆ తర్వాత అబ్బే అదేమీ లేదనడం పరిపాటిగా మారింది. అమలాపురంలో...

రివ్యూ: ఎఫ్‌3

F3 Telugu Movie Review తెలుగు360 రేటింగ్ : 3/5 న‌వ్వించే సినిమాలు ఎప్పుడో కానీ రావు. మేం న‌వ్విస్తాం అంటూ సినిమాలు తీసే ద‌ర్శ‌క‌నిర్మాత‌లే క‌రువ‌య్యారు. హీరోలు కూడా ఆ...

కేసీఆర్ చెప్పే ఆ సంచలనం అన్నాహజారేనేనా !?

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించడం ద్వారా సంచలనం సృష్టించాలనుకుంటున్న కేసీఆర్ ... తనచాయిస్‌గా అన్నా హజారానే నిలబెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. స్వయంగా మహారాష్ట్రలోని అన్నా హాజరే స్వగ్రామం రాలేగావ్...

టీడీపీ నేతలకు సజ్జల ఎన్‌కౌంటర్ బెదిరింపులు !

వైసీపీలో చేరకపోతే ఎన్ కౌంటర్ చేస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు, ఎమ్మెల్యేలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల బెదిరించారా ? అంటే అవుననే అంటున్నారు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఆయనను రెండున్నర నెలలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close