ప్రతి పక్షాలకు సమాధానం చెప్పడం మానేశారు. విమర్శించిన వాళ్ళను అభివృద్ధి నిరోధకులుగా తూలనాడడం ప్రారంభించారు. ప్రజల కష్టాలను పట్టించుకునే నాథుడే లేకుండా పోతున్నాడు. ఈ రోజు కష్టాల గురించి మాట్లాడేవాడు లేడు కానీ భవిష్యత్ మొత్తం బంగారం అని చెప్పడానికి మాత్రం మోడీ అండ్ కో నానా కష్టాలూ పడుతున్నారు. నోట్ల రద్దు నిర్ణయంతో జనజీవితం స్తంభించిపోయింది. నల్ల దొంగలు బ్రహ్మాండంగా ఉన్నారు. సామాన్యులు మాత్రం వందల సంఖ్యలో చనిపోయారు. బాధితుల సంఖ్య అయితే కోట్లలోనే. ఇన్ని కోట్ల నల్లధనాన్ని పట్టేశాం అని చెప్పి ప్రజలకు ఇప్పటి వరకూ చెప్పింది ఏమీ లేదు. టెర్రరిస్ట్‌ల దగ్గర కొత్త దొంగనోట్లు కనిపిస్తున్నాయి. ఏం సాధించారో ఎవ్వరికీ తెలియదు. అయినా సరే….మొత్తానికి ఎటిఎంలు మళ్ళీ వర్క్ చేయడం స్టార్ట్ అవడంతో జనాలు రొటీన్ లైఫ్‌కి అలవాటు పడ్డారు.
కానీ నోట్ల రద్దు సినిమా అప్పుడే అయిపోలేదని ఇప్పుడిప్పుడే అర్థమవుతూ ఉంది. ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియడం లేదు కానీ హైదరాబాద్ ఎటిఎంలలో కరెన్సీకి మరోసారి కరువు వచ్చింది. ఎక్కువ శాతం ఎటిఎంల దగ్గర నో క్యాష్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఇది మరీ రొటీన్ వ్యవహారమే కదా..విశేషం ఏముంది అని అనుకుందో ఏమో తెలియదు కానీ మెయిన్‌స్ట్రీమ్ మీడియా కూడా ఈ విషయానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. సామాన్యుల కష్టాలు మాత్రం మామూలుగా లేవు. మరోవైపు ఛార్జీల ప్రకటనలతో బ్యాంకులు భయం పుట్టిస్తున్నాయి. నరేంద్రమోడీ ప్రభుత్వం మొత్తం ఉత్తరప్రదేశ్ ఎన్నికల పైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా ఉంది. నో క్యాష్ బోర్డ్స్ గురించి మాట్లాడే తీరిక కూడా వాళ్ళకు లేదు. మొత్తానికి నరేంద్ర మోడీ దర్శకత్వంలో వచ్చిన ఈ నోట్ల కష్టాలన్నీ కూడా అంతులేని కథలా సాగుతూనే ఉంటాయో ఏమోనని ప్రజలు భయపడేపరిస్థితి.
నోట్ల కష్టాల గురించి ఆలోచించే తీరిక ప్రభుత్వ వ్యవస్థలకు ఉన్నట్టుగా లేదు కానీ ఆ నోట్ల కష్టాల గురించి వ్యతిరేక ప్రచారం జరిగితే ప్రజలు ఎక్కడ ప్రభుత్వం గురించి నెగిటివ్‌గా ఆలోచిస్తారో అన్న భయం మాత్రం ప్రభుత్వానికి ఉన్నట్టుంది. గంగపుత్రులు, సొంత ఊరు లాంటి చిన్న సినిమాలు తీసిన తెలుగు సినిమా డైరెక్టర్ సునీల్ కుమార్‌రెడ్డి….ఎటిఎం…నాట్ వర్కింగ్..అన్న పేరుతో ఓ చిన్న సినిమా తీశాడు. ఆ సినిమా టైటిల్‌ని సెన్సార్ బోర్డ్ మెంబర్స్ అబ్జెక్ట్ చేశారు. ఎటిఎం…నాట్ వర్కింగ్ అంటే ప్రభుత్వాన్ని తప్పు పట్టేలా ఉందని….ఎటిఎం…. వర్కింగ్ అని చెప్పి టైటిల్ మార్చుకోవాలని కండిషన్ పెట్టారట. ఈ తెలివితటలేవో నోట్ల కష్టాలు లేకుండా చేయడంపైన చూపిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందేమో. పని చేయకూడదు….కానీ చెడ్డపేరు రాకూడదు అంటే ఎలా సాధ్యం? ఈ ప్రశ్నకు వెంకయ్యనాయుడి మాటల మేజికల్ సమాధానం ఏమై ఉంటుందో?