ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సిక్కోలు నుంచి చిత్తూరు వరకూ మౌలిక సదుపాయాల పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రాజెక్టుల పనులు పరుగులు పెడుతున్నాయి. రాజధాని కోసం నిరంతరం పనులు జరుగుతున్నాయి. పరిశ్రమలు, ఇతర సంస్థల నిర్మాణాలు జరుగుతున్నాయి. అదే సమయంలో సంక్షేమం తగ్గడం లేదు. జగన్ రెడ్డి ఇచ్చిన దాని కన్నా రెట్టింపు ఇస్తున్నారు. మరి అప్పట్లో ఎందుకు అభివృద్ధిని ఆపేశారు. ఆ నిధులన్నీ ఎందుకు వినియోగించుకోలేదు ?. ఉద్దేశపూర్వకంగా చేసిన నిర్లక్ష్యమే అది. ప్రజల్ని పేదరికంలో ముంచేసింది వారికి రేషన్ బియ్యం, కాసిని డబ్బులు ఇచ్చి ఓటు బ్యాంకుగా మార్చుకోవాలన్న కుట్రను జగన్ రెడ్డి భయంకర స్థాయిలో అమలు చేశారు.
జగన్ రెడ్డి కన్నా రెట్టింపు సంక్షేమం
జగన్ రెడ్డి రాష్ట్రంలో ఓ కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అమ్మఒడి ఇచ్చారు. కానీ ఇప్పుడు తల్లికి వందనం పేరుతో కుటుంబంలో ఎంత మంది ఉంటే అందరికీ ఇచ్చారు. రైతులకు జగన్ మోసం చేసి ఏడు వేలు ఇస్తే.. చంద్రబాబు ప్రభుత్వం పదిహేను వేలు ఇస్తోంది. అన్న క్యాంటీన్లు పెట్టింది. పెన్షన్లు ముక్కీ మూలిగి ఏటా 250 పెంచడానికి కిందా మీదా పడితే చంద్రబాబు తొలి ఏడాదే వెయ్యి పెంచి ఒకటో తేదీనే అందిస్తున్నారు. ఆటో డ్రైవర్లకు జగన్ రెడ్డి పదివేలు ఇస్తే చంద్రబాబు పదిహేను వేలు ఇస్తున్నారు. ఇలా ఏ పథకం చూసుకున్నా.. పక్కాగా.. అమలవుతోంది. జగన్ రెడ్డి అసలు కంటే ఆర్భాటం ఎక్కువ… ముందు ప్రతి పథకంలో తన పత్రికకు ప్రకటనల రూపంలో కమిషన్ ఇచ్చుకునేవారు. ఇప్పటి ప్రభుత్వంలో అదే లేదు.
జగన్ హయాంలో లేని అభివృద్ధి పనులు ఇప్పుుడు !
ఏ రాష్ట్ర అభివృద్ధి అయినా .. పెట్టుబడి వ్యయం మీదే ఆధారపడి ఉంటుంది. అప్పులు తీసుకు వచ్చి.. వాటితో ఆస్తులు పెంచుకోవాలి. రాష్ట్రానికి ఆస్తులు అంటే.. రోడ్లు, ప్రాజెక్టులు వంటివి. ఏపీకి రాజధాని కూడా ఓ పెట్టుబడి. జగన్ హయాంలో అసలు పనులే జరిగేవి కావు. అమరావతిలో తట్ట మట్టిపోయలేదు. పోలవరాన్ని పడుకోబెట్టారు. ఏ ఒక్క ప్రాజెక్టును నిర్మించలేదు. రోడ్లను బాగు చేయలేదు. అసలు ఎలాంటి పనులు చేయించలేదు. కానీ ఇప్పుడు రాష్ట్రం పనులతో కళకళలాడుతోంది. ప్రభుత్వం పెద్ద ఎత్తున చేస్తున్న పనులకు తోడు.. ప్రైవేటు సంస్థల పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. వారు చేస్తున్న పనులతో రాష్ట్రం కళకళలాడుతోంది.
ప్రజల్ని బిచ్చగాళ్లనుచేసి ఓటు బ్యాంకును చేసుకోవాలనుకున్న జగన్
జగన్ రెడ్డి నాయకుడు కాదు. ఆయనో ముఠా నాయకుడు. ఆయన మనస్థత్వం వేరు. ప్రజలను అభివృద్ధి చేస్తే వారు తమ మాట వినరని.. వారిని బిచ్చగాళ్లుగా మార్చి.. తాము ఇచ్చే పదో పరకో తీసుకుని .. తమ ఓటు బ్యాంకుగా పడి ఉంటారని అనుకున్నారు. ఆయన మనస్థత్వం గురించి బాగా తెలుసుకుని ప్రజలు పాతాళంలోకి పడేశారు. అయినా బుద్దిరావడం లేదు. అభివృద్ది పనులకు అడ్డం పడుతున్నారు. ఫేక్ ప్రచారంతో ప్రజలపై దాడి చేస్తున్నారు.