‘సాహో’ కోసం దేవిశ్రీ ఓ పాట ఇచ్చాడా?

సాహో సినిమాకి మైన‌స్‌గా మారింది సంగీతం. ముందు శంక‌ర్ ఎహ‌సాన్ లాయ్‌ల‌ను సంగీత ద‌ర్శ‌కుల‌కుగా పెట్టుకున్నారు. కానీ వాళ్లు ఈ సినిమా నుంచి అర్థాంత‌రంగా త‌ప్పుకున్నారు. ఆ స‌మ‌యంలో ఏం చేయాలో తెలియ‌క‌.. ఒక్కో పాట‌నీ ఒక్కో సంగీత ద‌ర్శ‌కుడికి ఇచ్చి కంపోజ్ చేయించారు. అయితే ఆ పాట‌లు అంతగా కిక్ ఇవ్వ‌లేదు. సినిమాకి పాట‌లు మైన‌స్ గా మారాయి. అయితే.. జిబ్రాన్ అందించిన నేప‌థ్య సంగీతం మాత్రం బాగానే వర్క‌వుట్ అయ్యింది.

ఈ సినిమాకి దేవిశ్రీ ప్ర‌సాద్ కూడా ఓ పాట చేసి ఇచ్చాడ‌ని టాక్‌. ట్యూన్ ఇచ్చాక దాన్ని రికార్డ్ కూడా చేశార‌ని, అయితే.. తెర‌కెక్కించ‌లేద‌ని తెలుస్తోంది. క‌థానాయ‌కుడి ఇండ్ర‌డ‌క్ష‌న్ గీతాలు ఇవ్వ‌డంలో దేవిశ్రీ దిట్ట‌. అందుకే సాహోలో ప్ర‌భాస్ ఎంట్రీకి దేవితో ఓ పాట చేయించాల‌నుకున్నారు. దేవి కూడా పాట ఇచ్చేశాడు. కాక‌పోతే.. ఈ పాట వ‌ల్ల ఈ సినిమాకి వ‌చ్చే అద‌న‌పు ప్ర‌యోజ‌నం ఏమీ లేద‌నుకుని దాన్ని తెర‌కెక్కించ‌లేదు. మ‌ధ్య‌లో ఓ పాట‌ని తీసేసి, దేవి పాట‌ని పెట్టినా బాగుండేది. ఎందుకంటే దేవి పాట‌ల్లో ఓ కిక్ ఉంటుంది. అది సాహోకి ప్ల‌స్ అయ్యేది. మ‌రి ఆ ట్యూన్‌ని దేవి ఏం చేస్తాడో..??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com