దేవిశ్రీ‌కి అగ్ని ప‌రీక్షే

ఒక‌ప్పుడు దేవిశ్రీ ప్ర‌సాద్ ఆల్బ‌మ్ అంటే ఆరింటికి ఆరూ సూప‌ర్ హిట్ గీతాలొచ్చేవి. ఇప్పుడు ఆరు పాట‌ల్లో ఒక్క‌టి హిట్ అవ్వ‌డ‌మే గ‌గ‌నం అయిపోయింది. దేవి పాట‌ల‌పై కాపీ ముద్ర కూడా ప‌డ‌డం… అత‌ని పాట‌ల‌పై మాయ‌ని మ‌ర‌క‌గా మిగులుతోంది. దానికి తోడు త‌మ‌న్ మ‌రోవైపు దూసుకుపోతున్నాడు. త‌మ‌న్ వ‌న్నీ మ్యూజిక‌ల్ హిట్సే. ఆల్బ‌మ్‌లో ఒక్క పాటైనా…. రికార్డు స్థాయిలో మార్మోగుతోంది. దాంతో దేవిశ్రీ పై ఒత్తిడి పెరిగిపోయింది. ఇప్పుడు త‌న ముందున్న మార్గం ఒక్క‌టే. మ‌రో సూప‌ర్ హిట్ ఆల్బ‌మ్ తో ట్రాక్ లోకి రావ‌డం. ఈమ‌ధ్య `ఉప్పెన` చిత్రంలో ఓ మంచి పాట అందించాడు దేవి. ఈ పాట‌తో దేవీ మ్యాజిక్ మ‌ళ్లీ క‌నిపించింది, వినిపించింది. ఇప్పుడు మ‌రో అవ‌కాశం దేవి ముంగిట ఉంది. అదే సుకుమార్ తో సినిమా.

సుకుమార్ – దేవిశ్రీ‌ల‌ది ఎవ‌ర్ గ్రీన్ కాంబినేష‌న్‌. ఇప్ప‌టి వ‌ర‌కూ సుకుమార్ దేవిని వ‌దిలిపెట్ట‌లేదు. సుకుమార్ సినిమా అన‌గానే దేవి కూడా అదే స్థాయిలో రెచ్చిపోయి పాట‌లిస్తాడు. ఫామ్ లో లేన‌ప్పుడు కూడా `రంగ‌స్థ‌లం` ఆల్బ‌మ్ తో దేవి అద‌ర‌గొట్టాడు. `అల వైకుంఠ‌పుర‌ములో` సినిమాకి త‌మ‌న్ మంచి పాట‌లిచ్చిన్ప‌ప‌టికీ, దేవిశ్రీ ఎంపిక‌ను బ‌న్నీ కూడా కాద‌లేక‌పోయాడు. దానికి కార‌ణం… దేవిశ్రీ‌తో బ‌న్నీకి ఉన్న అనుబంధం. అల్లు అర్జున్‌కి కూడా దేవి మంచి పాట‌లే ఇచ్చాడు. ఇప్పుడు అటు బ‌న్నీని, ఇటు సుక్కునీ, మొత్తంగా త‌న అభిమానుల్ని సంతృప్తిప‌ర‌చాల్సిన బాధ్య‌త దేవిశ్రీ‌పై ఉంది. ఈ సినిమాకి మంచి పాట‌లిస్తే స‌రేస‌రి. లేదంటే.. దేవిశ్రీ కోలుకోవ‌డం క‌ష్ట‌మే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రెండు రోజుల్లోనే “కుట్ర కోణం” కనిపెట్టిన డీజీపీ..!

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ ఆలయాలపై జరుగుతున్న దాడుల దర్యాప్తు విషయంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లుగా ఉన్నారు. రెండు రోజుల క్రితం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన... రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న...

ఎవరూ తగ్గరు.. మరి చర్చలెందుకు..!?

కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాలు చర్చల పేరుతో దాగుడు మూతలాడుతున్నాయి. ప్రజలకు సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పడానికా అన్నట్లుగా... వారానికో సారి భేటీ అవుతున్నారు. మూడు నాలుగు గంటల పాటు సమావేశం...

సంక్రాంతి షో అంతా మెగా ఫ్యామిలీదే..!

సంక్రాంతి సంబరాలు సెలబ్రిటీలు ఎలా జరుపుకుంటారనే ఆసక్తి సామాన్య జనానికి ఉంటుంది. అయితే ఎక్కువ మంది సెలబ్రిటీలు తాము ఎలా జరుపుకుంటామో బయటకు తెలియనివ్వరు. మెగా ఫ్యామిలీ ఈ ఏడాది మాత్రం.. తమ...

క్రాక్ .. పరిశ్రమకి ధైర్యం ఇచ్చింది: గోపీచంద్ మలినేనితో ఇంటర్వ్యూ

రవితేజ, గోపీచంద్ మలినేని కలసి హ్యాట్రిక్ కొట్టేశారు. సంక్రాంతి విజేతగా నిలిచింది క్రాక్. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులకు హైవోల్టేజ్ వినోదం ఇచ్చింది. బాక్సాఫీసు వద్ద హంగామా చేస్తుంది. కరోనా...

HOT NEWS

[X] Close
[X] Close