టాలీవుడ్‌ కీల‌క నిర్ణ‌యం

ఈనెల 14న లాక్ డౌన్ ఎత్తేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ద‌శ‌ల వారిగా లాక్ డౌన్ నిబంధ‌న‌ల్ని స‌డ‌లించే ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉంద‌ని ఇప్ప‌టికే సంకేతాలు అందేశాయి. ఈ నేప‌థ్యంలోనే టాలీవుడ్ ఓ కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. లాక్ డౌన్ ఎత్తేసి, థియేట‌ర్ల‌కు పర్మిష‌న్లు ఇచ్చినా స‌రే, మ‌రో మూడువారాల పాటు సినిమాల్ని విడుద‌ల చేయ‌కూడ‌ద‌ని ఓ ఉమ్మ‌డి నిర్ణ‌యం తీసుకోబోతోంద‌ని టాక్‌. లాక్ డౌన్ ఎత్తేసినా, ప‌రిస్థితులు స‌ద్దుమ‌ణ‌గ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంది. దానికి తోడు థియేట‌ర్ల‌కు, షాపింగ్ మాల్స్‌కీ అనుమ‌తులు ఇవ్వ‌క‌పోవొచ్చు. ఎంత లేట్ అయినా… మే తొలి వారం నుంచి కొత్త సినిమాలు వ‌స్తాయ‌ని భావించ‌డంలో త‌ప్పులేదు. కానీ చిత్ర‌సీమ మాత్రం అందుకు సిద్ధంగా లేద‌ని తెలుస్తోంది. భ‌విష్య‌త్తుని, సినీ కార్మికుల ఆరోగ్యాన్నీ దృష్టిలో ఉంచుకుని లాక్ డౌన్ ఎత్తేసినా, మ‌రో మూడు వారాల పాటు సినిమా షూటింగుల‌తో పాటు, సినిమా విడుద‌ల కూడా నిలిపివేయాల‌ని ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ ఎత్తేసినట్టు ప్ర‌క‌ట‌న వ‌స్తే.. అప్పుడు చిత్ర‌సీమ ఈ కొత్త నిర్ణ‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టిస్తుంద‌ని స‌మాచారం. ఒక‌వేళ లాక్ డౌన్ కొన‌సాగితే మాత్రం.. ప్ర‌క‌ట‌న వెలువ‌రించాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఇందుకు సంబంధించి `మా`, ఫిల్మ్ ఛాంబ‌ర్‌, ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ ఇప్ప‌టికే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్ర‌భాస్ సినిమా: దేవుడు Vs సైన్స్‌

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ‌తో ఓ సినిమా చేస్తున్నాడు. 'జాన్‌', 'రాధే శ్యామ్‌' పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. న‌వంబ‌రు నుంచి వైజ‌యంతీ మూవీస్‌కి డేట్లు ఇచ్చాడు. ఈ చిత్రానికి నాగ అశ్విన్ నిర్మాత‌. పాన్...

ఫ్లాష్ బ్యాక్‌: సూప‌ర్ స్టార్స్ అడిగితే సినిమా చేయ‌నన్నారు

ఓ స్టార్ హీరో పిలిచి - ఓ కొత్త ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇస్తే, కాదంటాడా? చేయ‌నంటాడా? ఎగిరి గంతేస్తాడు. త‌న ద‌గ్గ‌ర క‌థ లేక‌పోయినా అప్ప‌టిక‌ప్పుడు వండేస్తాడు. మీతో సినిమా చేయ‌డంతో నా జ‌న్మ ధ‌న్యం అంటాడు....

భారత్‌ను రెచ్చగొడుతున్న చైనా !

భారత్‌ను చైనా కావాలనే కవ్విస్తోంది. అవసరం లేకపోయినా.. సరిహద్దుల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరిస్తోంది. భారత సైన్యాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. సరిహద్దుల్లో పరిస్థితి అంతకంతకూ ఉద్రిక్తతంగా మారుతోంది. యుద్ధం ప్రారంభించడానికి సిద్ధంగా...

రాయలసీమ ఎత్తిపోతల భవితవ్యం ఏపీ సర్కార్ చేతుల్లోనే..!

సంగమేశ్వరం వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు జీవో ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు కారణంగా వచ్చిన వివాదాల విషయంలోనూ అంతే పట్టుదల ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది. ఈ ప్రాజెక్ట్ కొత్త ప్రాజెక్ట్...

HOT NEWS

[X] Close
[X] Close