వైసీపీలోకి దేవినేని అవినాష్..!?

తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్… తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. ఇసుక విషయంలో చంద్రబాబు దీక్ష ప్రారంభించడానికి ఒక్క రోజు ముందు… తన అనుచరులతో సమావేశం అయ్యారు. పార్టీ మార్పు అంశంపై చర్చించారు. పార్టీలో కష్టపడి పని చేస్తున్నప్పటికీ.. తనకు ప్రాధాన్యత దక్కడం లేదని ఆయన అనుచరుల వద్ద వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు మాటకు కట్టుబడి పనిచేసిన అవినాష్‌కి.. పార్టీలో తగిన న్యాయం జరగలేదంటుని అవినాష్‌ అనుచరులు .. టీడీపీ హైకమాండ్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది నేతలు.. ఆవినాష్‌కు ప్రాధాన్యం దక్కకుండా చేస్తున్నారంటున్నారు. పార్టీ మారాలని అవినాష్‌పై కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

న్యాయం జరగని టీడీపీలో ఎంత కష్టపడి పనిచేసినా.. విలువ ఉండదని అవినాష్ ఓ అంచనాకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇంత హఠాత్తుగా.. దేవినేని అవినాష్… అనుచరులతో ఎందుకు సమావేశం అవ్వాల్సి వచ్చిందనేదానిపై.. రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దేవినేని అవినాష్‌ను తమ పార్టీలో చేర్చుకునేందుకు.. వైసీపీ కొద్ది రోజులుగా ప్రయత్నిస్తోంది. ఆయనతో.. చర్చలు కూడా జరిపింది. కారణం ఏమిటో తెలియదు కానీ.. చాలా సార్లు దేవినేని అవినాష్ ఆ వార్తలను ఖండించారు. ప్రాణం పోయే వరకూ టీడీపీలోనే ఉంటానని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో ఆయనకు.. గుడివాడ టిక్కెట్ ను చంద్రబాబు కేటాయించారు. కొడాలి నానికి గట్టి పోటీ ఇచ్చి.. పరాజయం పాలయ్యారు. తెలుగు యువత అధ్యక్షుడిగా కీలకంగానే పని చేస్తున్నారు.

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత ఉపఎన్నికలొస్తే… అక్కడ అభ్యర్థిగా… దేవినేని అవినాష్ పేరును కూడా కొంత మంది ప్రతిపాదించారు. అయితే.. పార్టీలో అంతర్గత రాజకీయాలు… ప్రాధాన్యత దక్కకుండా చేస్తున్నాయని ఆయన నమ్ముతున్నారు. వైసీపీ నుంచి ఆఫర్ ఉండటంతో… ఆ దిశగా ఆలోచన చేసినట్లుగా తెలుస్తోంది. పార్టీ మార్పు నిర్ణయాన్ని ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పూర్తి పేరు వాడకపోతే జగన్ పార్టీకి చిక్కులే..!?

నర్సాపురం ఎంపీ తెచ్చిన పెట్టిన కష్టం.. వైసీపీని ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఆయనను టార్గెట్ చేసి.. రకరకాల కేసులు పెడుతూ.. చికాకు పెడుతున్నామని వైసీపీ పెద్దలు అనుకుంటున్నారేమో కానీ.. ఆయన లేవనెత్తిన...

మీడియా వాచ్‌: ప్రముఖ కార్టూనిస్ట్‌‌కు క‌రోనా?

తెలుగులోనే అగ్ర‌గామి దిన ప‌త్రిక‌లో ప‌నిచేస్తున్న ప్ర‌ముఖ కార్టూనిస్ట్‌‌ కు క‌రోనా సోకిన‌ట్టు స‌మాచారం. ద‌శాబ్దాలుగా అగ్ర‌గామిగా కొన‌సాగుతున్న ప‌త్రిక‌లో... ఈయ‌న కార్ట్యూన్ల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంటుంది. తొలి పేజీలో.. త‌న గీతల‌తో...

కేసీఆర్ ఆరోగ్యంపై పిటిషన్.. హైకోర్టు ఆగ్రహం..!

తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా కాలంగా కనిపించడం లేదని .. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియచేయాలంటూ... హైకోర్టులో తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై...

ప్రసాదాలు, విగ్రహాలతో కేంద్రం నుంచి నిధులు రాలతాయా..!?

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ...కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. జీతాలు ఇవ్వడానికి ఎనిమిదో తేదీ వరకూ ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిన సందర్భంలో .. తక్షణం రాష్ట్రానికి...

HOT NEWS

[X] Close
[X] Close