దేవినేని వర్సెస్ వసంత..! మిస్టరీ మరణాల గుట్టు విప్పేస్తారా..?

రాజకీయాల్లో గీత దాటితే అంతే. పాత విషయాలు కొత్తగా బయటకు వస్తాయి. కృష్ణా జిల్లా మైలవరంలో.. టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు వరకూ వెళ్తోంది. మైలవరంలో టీడీపీ తరపున దేవినేని ఉమ, వైసీపీ తరపున వసంత కృష్ణప్రసాద్ పోటీ చేశారు. వసంత కృష్ణప్రసాద్ గెలిచారు. దేవినేని ఉమ ఓడిపోయారు. అప్పట్నుంచి… నియోజకవర్గంలో పరిస్థితి ఉప్పు – నిప్పులా ఉంది. రాజధానిగా అమరావతిని మారిస్తే.. రాజీనామా చేస్తానన్న కృష్ణప్రసాద్.. యూటర్న్ తీసుకున్నారు. దాంతో దేవినేని ఉమ.. రాజధాని ఉద్యమాన్ని తన నియోజకవర్గంలో ఓ రేంజ్‌లో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో.. మూడు రాజధానులకు మద్దతుగా.. వసంత కృష్ణప్రసాద్ తండ్రి మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.

దీంతో దేవినేని ఉమ తీవ్రమైన విమర్శలు చేశారు. ప్రజల్ని అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు వంచించారని.. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే… మోసం చేస్తున్నారని.. ఉమ మండిపడ్డారు. వారిని ప్రజలు.. ఎలాంటి కార్యక్రమాలకూ పిలవొద్దన్నారు. దీనిపై వసంత నాగేశ్వరరావు కూడా ఘాటుగా స్పందించారు. దేవినేని ఉమపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఇంతటితో దేవినేని ఉమ వదిలి పెట్టలేదు..మళ్లీ ప్రెస్‌మీట్ పెట్టి.. కొత్త ఆరోపణలు చేశారు. కొత్త కొత్త క్యారెక్టర్లను తీసుకొచ్చారు. బినామీ ఆస్తుల కోసమే పొదిలి రవిని వసంత నాగేశ్వరరావు చంపారని.. హైదరాబాద్‌లోని మీ ఇంట్లో బాపట్ల మేరీ చనిపోయింది వాస్తవం కాదా అని రెండు కొత్త క్యారెక్టర్లను తీసుకొచ్చారు. దీంతో ఉలిక్కిపడిన వసంత నాగేశ్వరరావు.. వెంటనే మీడియాకు పిలిచి.. కొత్త సవాల్ విసిరారు.

బాపట్ల మేరీ చనిపోయిన రోజు కృష్ణప్రసాద్ హైదరాబాద్‌లో ఉన్నాడని రుజువు చేస్తే నేను తల తీసుకుంటా లేదంటే నువ్వు తల తీసుకుంటావా అని సవాల్ చేశారు. దేవినేని ఉమ విమర్శలను వెనక్కు తీసుకోకుంటే తాట వలుస్తానని హెచ్చరించారు. అంతటితో వదిలి పెట్టలేదు… వదినను చంపిన దేవినేని ఉమకు సవాల్ చేయాలంటే సిగ్గుగా ఉందన్నారు. ఇప్పుడు అందరికీ.. పొదిలి రవి, బాపట్ల మేరీ, ఉమ వదిన మృతి మిస్టరీలుగా కనిపిస్తున్నాయి. రాజకీయాల్లోకి వ్యక్తిగత విషయాలను తీసుకొస్తే.. కుటుంబాలు రోడ్డున పడతాయన్న విషయాన్ని నేతలిద్దరూ మర్చిపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close