మేం విడిపోతున్నాం – అంటూ ఇటీవల ధనుష్, ఐశ్వర్యలు సంచలన ప్రకటన చేశారు. పద్ధెనిమిదేళ్ల వైవాహిక జీవితానికి… స్వస్తి చెబుతూ ఇద్దరూ తీసుకున్న నిర్ణయం… అభిమానుల్ని షాక్‌కి గురి చేసింది. పెద్దలు ఎంత ప్రయత్నించినా, ఫలితం లేకుండాపోయిందని, చివరికి విడాకుల వెళ్లాల్సివచ్చిందని చెప్పుకున్నారు. విడాకుల తరవాత అటు ధనుష్, ఇటు ఐశ్వర్య ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోయారు. అయితే ఇప్పుడు ఈ జంట మళ్లీ ప్యాచప్ అవ్వబోతోందన్నది చెన్నై వర్గాల టాక్.
వీరిద్దరి విడాకులకు సంబంధించిన అధికారిక డాక్యుమెంట్లు ఇంకా రాలేదు. అవింకా ప్రోసెస్ లోనే ఉన్నాయి. అయితే ధనుష్, ఐశ్వర్యలు ఇంకా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారని, పిల్లల కోసం కొన్నాళ్లు కలిసే ఉండాలన్న నిర్ణయానికి వచ్చారని, అధికారికంగా విడాకులు వచ్చేసినా, తరచూ కలుసుకోవడాలూ, మాట్లాడుకోవడాలూ కామనే అని… ఇద్దరూ ఓ అభిప్రాయానికి వచ్చారట. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు. యాత్ర, లింగ.. ఇద్దరూ అబ్బాయిలే. సెలబ్రెటీల పెళ్లిళ్లు, విడాకులూ.. ఎప్పుడూ విచిత్రంగానే ఉంటాయి. పవన్ – రేణూ దేశాయ్‌లు విడిపోయిన తరవాత కూడా.. ఇద్దరూ కొన్నాళ్లు కలిసే ఉన్నారు. అకీరా కోసం. రేణూ పూణెలో ఉంటే పవన్ తరచూ వెళ్తూ, కలుస్తూ ఉండేవాడు. ఇప్పుడు ధనుష్, ఐశ్వర్యల విషయంలోనూ ఇదే జరగబోతోంది.