ధనుష్ అంటే తెలుగు నాట కూడా క్రేజే. మరీ సూర్య, విక్రమ్ అంత కాకపోయినా తనకంటూ తెలుగులో కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. రఘువరన్ బీటెక్ సినిమా తెలుగులోనూ బాగా ఆడింది. దాంతో ధనుష్ సినిమాలకు తెలుగునాట ఫాలోయింగ్ పెరిగింది. పైగా ధనుష్ మంచి కథల్ని ఎంచుకొంటాడన్న నమ్మకం కూడా కలుగుతోంది. అందుకే ధనుష్ సినిమా రైల్పై తెలుగు ప్రేక్షకులు దృష్టి పెట్టారు. ట్రైలర్ చూస్తుంటే ఇదేదో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలా తోస్తోంది. అలాంటి సినిమాలు ఈమధ్య బాగా ఆడుతున్న నేపథ్యంలో రైల్పై ఫోకస్ మరింత పెరిగింది. గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సివుంది. అయితే ఈరోజు ఈ బొమ్మ ఇంకా పడలేదు. అడ్వాన్స్ బుకింగులు ఇచ్చినా సరే.. ఉదయం ఆటలు రద్దయ్యాయి. ఈ రోజు రైల్ వస్తుందా, రాదా అనేది అనుమానంగా మారింది. ఫైనాన్సియల్ క్లియరెన్స్ లేకనే ఈ సినిమా తెలుగులో విడుదల అవ్వడం లేదని తెలుస్తొంది. ఎందుకనో రైల్ సినిమాని పబ్లిసిటీ పరంగానూ పట్టించుకోలేదు. ఈ సినిమాకి కనీస ప్రచారం కూడా లేకుండా పోయింది. నేను శైలజతో ఆకట్టుకొన్న కీర్తి సురేష్ ఈ సినిమాలో కథానాయిక. కనీసం తనని తీసుకొచ్చి కూడా పబ్లిసిటీ చేయలేదు. ఇప్పుడు విడుదల రోజున అర్థాంతరంగా ఆగిపోయింది. ఈ రైల్‌కి గ్రీన్ సిగ్నల్ పడేదెప్పుడో..??