ధ‌నుష్‌తో శేఖ‌ర్ క‌మ్ముల‌… వాటే కాంబినేష‌న్‌!

శేఖ‌ర్ క‌మ్ముల.. సెన్సుబుల్ ద‌ర్శ‌కుడు. న‌టుల్ని త‌న‌కు కావ‌ల్సిన‌ట్టుగా మార్చేసుకుంటాడు. ధ‌నుష్ వెర్స‌టైల్ యాక్ట‌ర్‌. ద‌ర్శకుడికి ఎలా కావాలంటే అలా మారిపోతాడు. వీరిద్ద‌రూ క‌లిస్తే ఎలా ఉంటుంది? సూప‌ర్ క‌దూ. ఇప్పుడు ఈ కాంబినేష‌న్ కుదిరిపోయింది. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ధ‌నుష్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఒకేసారి తెర‌కెక్క‌బోతోంది. ధ‌నుష్ తెలుగులో నేరుగా చేస్తున్న సినిమా ఇదే. నారాయ‌ణ్ దాస్‌, పి.రామ్మెహ‌న్ రావుతో పాటు.. ధ‌నుష్‌, శేఖ‌ర్ క‌మ్ముల కూడా ఈ చిత్రానికి నిర్మాత‌లుగా వ్య‌వహ‌రిస్తున్నారు. త్వ‌ర‌లోనే న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు ప్ర‌క‌టిస్తారు. ఏసియ‌న్ సినిమాలో శేఖర్ క‌మ్ముల `ల‌వ్ స్టోరీ`తెర‌కెక్కించారు. థియేట‌ర్ల‌కి వంద శాతం ఆక్యుపెన్సీ ఇచ్చిన వెంట‌నే ఈ చిత్రం విడుద‌ల అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కృనాల్‌కు కరోనా… శ్రీలంకతో రెండో టీ ట్వంటీ వాయిదా..!

కాసేపట్లో ప్రారంభం కావాల్సిన శ్రీలంక-ఇండియా మధ్య రెండో టీ ట్వంటీ మ్యాచ్ అనూహ్యంగా వాయిదా పడింది. ఇండియా ఆటగాడు కృనాల్ పాండ్యాకు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితం పాజిటివ్ గా రావడంతో ...

జ‌గ‌న్ అప్పాయింట్ మెంట్ దొర‌క‌డం లేదా?

టికెట్ రేట్ల గొడ‌వ ఇంకా తేల‌లేదు. ఈలోగానే రెండు సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. తిమ్మ‌రుసు, ఇష్క్ చిత్రాలు ఈనెల 30న విడుద‌ల అవుతున్నాయి. లాక్ డౌన్ త‌ర‌వాత విడుద‌ల అవుతున్న తొలి చిత్రాలివి....

మీడియా వాచ్ : టీవీ9 యాంకర్లపై కేసులు..!

టీవీ9 యాంకర్లు రోడ్డున పడ్డారు. కేసులు పెట్టుకున్నారు. దీంతో టీవీ9 యజమాన్యం కూడా ఉలిక్కిపడింది. వారి గొడవ పూర్తిగా వ్యక్తిగతమని చానల్‌కు.. వారు చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేదని సోషల్ మీడియాలో ప్రకటించుకోవాల్సి...

మాన్సాస్ ట్రస్ట్‌లో చైర్మన్ చెప్పినట్లే జరగాలి : హైకోర్టు

మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టు షాకిచ్చింది. ఉద్యోగులకు జీతాలు నిలిపివేయడం.. ట్రస్ట్ ఖాతాలను స్తంభింపచేయడంపై చైర్మన్ అశోక్ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు.....

HOT NEWS

[X] Close
[X] Close