‘కాలా’ రజనీకాంత్ ను చూశారా ?

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం రోబో ‘2.0’ తో బిజీగా వున్నారు. ఈ చిత్రం తర్వాత ఆయన ‘కబాలి’ దర్శకుడు పా రంజిత్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. రజనీ అల్లుడు ధనుష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది వరకే ఈ సినిమాకి సంబధించిన ప్రకటన వచ్చింది.

ఈ చిత్రానికి ‘కాలా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని ధనుష్‌ తన ట్విటర్‌ ద్వారా ప్రకటిస్తూ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశాడు. ఈ ఫస్ట్ లుక్ కబాలి మాదిరిగా డాన్ లుక్ లో దర్శనమిచ్చారు రజనీ. కేవలం షాడో పెయింటింగ్ లా కనిపిస్తున్న రజనీ లుక్ కబాలి మాదిరిగానే వుంది.

ఈ సినిమా కూడా ఓ డాన్ జీవితం ఆదారంగా తెరక్కుతుందని టాక్ వినిపిస్తుంది. ఇటివలే దీనిపై ఆ డాన్ వర్గీయులు వివాదం కూడా రేపారు. అయితే రజనీ టీం మాత్రం సైలంట్ గా తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దాదాపు ‘కబాలి’కి పనిచేసిన టెక్నికల్ యూనిట్ ఈ చిత్రానికీ పని చేస్తుంది. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్‌ నటి హ్యూమా ఖురేషీ రజనీకి జోడీ కడుతుంది. 2018 ప్రదమార్ధంలో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.