జిల్లా విభజనకు వ్యతిరేకంగా ధర్మాన ..!

వైసీపీలో మరో అసంతృప్తి స్వరం మెల్లగా బయటకు వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు .. శ్రీకాకుళం జిల్లాలను.. విభజించబోతున్నారన్న ప్రచారం నేపధ్యంలో హఠాత్తుగా వ్యతిరేక ప్రకటన చేశారు. శ్రీకాకుళం జిల్లాను విభజిస్తారన్న ప్రచారం జరుగుతోందని.. ఈ విషయంలో ప్రజల్లో చాలా ఆవేదన ఉందని… చెప్పుకొచ్చారు. జిల్లా విభజన విషయంలో తమ వాదన వినాలని ఆయన కోరుతున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాల విభజన చేస్తే.. ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని.. రాజకీయంగా నష్టపోతామని ధర్మాన అంటున్నారు. జిల్లాల విభజన విషయంలో ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన చేయలేదు. ముఖ్యమంత్రి నోటి వెంట.. ప్రతిపాదన ఉందని మాత్రమే అన్నారు. అయినా సీనియర్ నేత ధర్మాన.. ప్రజలు అసంతృప్తిగా ఉన్నారంటూ మీడియా ముందుకు వచ్చారు.

సాధారణంగా రాజకీయ నేతలు చేసే ప్రకటనలకు.. కొంత భిన్నమైన అర్థాలు ఉంటాయి. ప్రభుత్వానికి .. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడాలంటే.. వారి డిమాండ్లేవో.. ప్రభుత్వం దగ్గర ఉన్నాయని అర్థం. ఇప్పుడు… ధర్మాన .. ప్రభుత్వం.. సొంత పార్టీ నుంచి ఏం అశిస్తున్నారో పెద్దగా క్లారిటీ లేదు. ఖాళీ అయిన రెండు మంత్రి పదవుల విషయంలో.. తన పేరును పరిశీలనలోకి తీసుకోవాలని ఆయన .. తన మాటల ద్వారా హైకమాండ్‌కు… సందేశం పంపారన్న ప్రచారం కూడా ఉంది. అదే సమయంలో.. ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ కు.. డిప్యూటీ సీఎం ఇస్తారని చెబుతున్నారు. అదే జరిగితే.. తనకు మరింత ప్రాధాన్యం తగ్గిపోతుందని ఆయన ఆందోళన చెందుతున్నట్లుగా జిల్లా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ధర్మాన.. సీనియర్ నేతగా.. తనకు తగినంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నారు. కానీ.. వైసీపీ హైకమాండ్ నుంచి అలాంటి సూచనలు ఏమీ కనిపించడం లేదు. సాదా సీదా ఎమ్మెల్యేలాగానే ఉండిపోయారు. ఏ ఇతర బాధ్యతలూ ఆయనకు ఇవ్వడం లేదు. అదే సమయంలో.. సోదరుడికి ప్రాధాన్యత పెంచడం.. శ్రీకాకుళం రాజకీయాల్లో తనను ఒంటరి చేసే ప్రయత్నం చేయడం.. ఆయనకు ఇబ్బందికరంగా మారింది. అందుకే.. ఇటీవలి కాలంలో.. ప్రభుత్వంపై అసంతృప్తి ప్రకటనలు చేస్తున్నారంటున్నారు. కొద్ది రోజుల కిందట… శ్రీకాకుళం ప్రభుత్వాసుపత్రి.. క్లీనింగ్ కాంట్రాక్ట్ విషయంలోనూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు నేరుగా జిల్లా విభజనకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. ప్రజలు భావోద్వేగానికి గురయ్యే అంశం కావడంతో.. వైసీపీ హైకమాండ్ ఎలా స్పందింస్తుందో.. చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హోదా ఇస్తేనే విభజన చట్టం అమలు..! హైకోర్టుకు ఏపీ సర్కార్ అఫిడవిట్..!

అమరావతి మార్పు గురించి ప్రస్తావన లేని పిటిషన్‌పై వేసే అఫిడవిట్లలో అటు కేంద్రం..ఇటు ఏపీ...రాజధాని మార్పు గురించి తమ విధానానని హైకోర్టులో చెప్పడం... ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2018 మార్చి 29న విభజన...

ఆహా ప్లానింగ్ : చిరుతో వెబ్ సిరీస్… 42 షోస్‌

తొట్ట తొలి ఓటీటీ సంస్థ ఆహా.. భారీ ప్లానింగ్ తో రాబోతోంది. వ‌రుస‌గా సినిమాలు కొంటూ, వెబ్ సిరీస్ లు రూపొందిస్తూ.. కంటెంట్ బ్యాంక్ ని పెంచుకుంటోంది ఆహా. రాబోయే రోజుల్లో ఆహా...

170 కోట్ల‌తో ఓటీటీ సినిమానా?

ఓటీటీ.. ప‌రిధి పెరుగుతోంది. చిత్ర‌సీమ‌ని మెల్ల‌మెల్ల‌గా ఓటీటీ ఆక్ర‌మించుకుంటోంది. నిర్మాత‌ల‌కు ఇదో ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా మారింది. థియేట‌ర్ల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఓటీటీ త‌న రూపాన్ని మార్చుకుంటోంది. ఓటీటీ సంస్థ‌లే... భారీ పెట్టుబ‌డితో సినిమాలు...

ఫ్లాప్ హీరోతో.. యూవీ సినిమా

ద‌ర్శ‌కుడు శోభ‌న్ గుర్తున్నాడా? వ‌ర్షం సినిమా ద‌ర్శ‌కుడు. ప్ర‌తిభావంత‌మైన ద‌ర్శ‌కుడు... చాలా త‌క్కువ వ‌య‌సులోనే క‌న్నుమూశాడు. త‌న త‌న‌యుడే సంతోష్. త‌ను నేను, పేప‌ర్ బోయ్ సినిమాల‌లో హీరోగా క‌నిపించాడు. ఆ...

HOT NEWS

[X] Close
[X] Close