తెలంగాణ రాజకీయల్లో మళ్లీ ” సెక్షన్ 8″ ..!

సెక్షన్ 8 అంశం తెలంగాణ రాజకీయాల్లో కొత్త కలకలం రేపుతోంది. పాత సెక్రటేరియట్‌ను కూల్చివేయడానికి గవర్నర్ అనుమతి తీసుకున్నారా.. అనే ప్రశ్నతో.. కాంగ్రెస్ నేతలు.. ప్రభుత్వంపై ఎదురుదాడి ప్రారంభించారు. ఎందుకంటే.. హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని. పదేళ్ల పాటు… హైదరాబాద్‌కు సంబంధించిన అంశాల్లో.. గవర్నర్‌కు విశేషాధికారాలు కల్పిస్తూ.. విభజన చట్టంలో సెక్షన్ 8ను చేర్చారు. ఈ అధికారాలను గతంలో గవర్నర్ నరసింహన్ వాడుకునే ప్రయత్నం చేశారు కానీ.. కేసీఆర్ వాటిని చాకచక్యంగా ఆపేయగలిగారు. తర్వాత చంద్రబాబు.. సెక్రటేరియట్‌ను అమరావతికి మార్చుకోవడంతో.. సెక్షన్ 8 అనే పదానికి దాదాపుగా ముగింపు వచ్చేసినట్లయింది. అయితే.. తాజాగా కాంగ్రెస్ నేతలు మళ్లీ పాత సచివాలయం విషయంలో.. ఈ సెక్షన్ ఎయిట్ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

సెక్షన్ 8 ప్రకారం.. సచివాలాయన్ని కూల్చివేయాలంటే… గవర్నర్ అనుమతి తప్పనిసరి. తెలంగాణ వాటాగా వచ్చిన భవనాల కూల్చివేత విషయంలో అవసరం లేదు. కానీ.. ఏపీ ప్రభుత్వం … తెలంగాణ సర్కార్ కు ఇచ్చేసిన.. భవనాల విషయంలో మాత్రం.. గవర్నర్ అనుమతి ఉండాల్సిందే. ఎందుకంటే.. పదేళ్ల పాటు.. ఆ భవనాలు.. ఏపీవే. తెలంగాణకు అప్పగించేయడం అనేది.. రెండు ప్రభుత్వాల మధ్య జరిగిన వ్యవహారం. కానీ విభజన చట్టం ప్రకారం… ఉమ్మడి రాజధానిలో ఏపీకి కేటాయించిన భవనాలు మాత్రం.. పదేళ్ల పాటు ఏపీవే. అందుకే కాంగ్రెస్ నేతలు సెక్షన్ 8 అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. దీనికి టీఆర్ఎస్ నేతలు ఘాటుగానే సమాధానం చెబుతున్నారు. ఆంధ్ర తొత్తుల్లా మాట్లాడుతున్నారని విమర్శలు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ‌్ ప్రభుత్వం బేషరతుగా భవనాలు అప్పగించిన తర్వాత సెక్షన్ 8 అనే ప్రస్తావన రాదని.. హరీష్ రావు లాంటి నేతలు ఘాటుగానే బదులిస్తున్నారు.

అయితే.. కాంగ్రెస్ నేతలు.. సెక్షన్ 8 అంశాన్ని లేవనెత్తలేదని.. టీఆర్ఎస్ ప్రభుత్వ చర్యల వల్లనే… ఈ అంశం హాట్ టాపిక్ అవుతోందని కాంగ్రెస్ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. సెక్షన్ 8 అంశం పూర్తిగా గవర్నర్ అధికారాలకు సంబంధించినది. ఇప్పుడు గవర్నర్.. ఆ సెక్షన్ ను ఉపయోగించుకోవాలని అనుకుంటే ప్రభుత్వానికి చిక్కులు తప్పవు. ఈ దిశగా.. ఏమైనా కార్యాచరణ ఉంటే.. ఈ పాటికి గవర్నర్ స్పందించి ఉండేవారు. గవర్నర్‌కు పాత సచివాలయం కూల్చివేత మీద ఎలాంటి ఫిర్యాదులు వెళ్లలేదు కాబట్టి..ఆమె కూడా స్పందించలేదు. ముందు ముందు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close