ఓటీటీ వైపు చూస్తున్న కీర్తి సినిమాలు

ఇటీవ‌లే ఓటీటీలో విడుద‌లైంది.. ‘పెంగ్విన్‌’. కీర్తి సురేష్ న‌టించిన ఈసినిమాకి రివ్యూలూ, రేటింగులూ ఆశాజ‌న‌కంగా లేవు. కానీ… వ్యూవ‌ర్ షిప్ మాత్రం బాగానే వ‌చ్చింది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల కావ‌డం వ‌ల్ల‌, ఆయా భాష‌ల్లో కీర్తికి మంచి గుర్తింపు ఉండ‌డం వ‌ల్ల – జ‌నాలు బాగానే చూశారు. దాంతో కీర్తి న‌టించిన మ‌రో సినిమాలు కూడా ఇప్పుడు ఓటీటీ వైపు చూస్తున్నాయి.

కీర్తి చేసిన ‘గుడ్ ల‌క్ స‌ఖీ’, ‘మిస్ ఇండియా’ దాదాపుగా పూర్త‌య్యాయి. మిస్ ఇండియా అయితే ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సింది. కానీ.. లాక్ డౌన్ వ‌ల్ల కుద‌ర‌లేదు. ఇప్పుడు ఈ చిత్రాలు ఓటీటీకి వెళ్లే ఛాన్సుంద‌ని తెలుస్తోంది. నా సినిమాల్నీ ఓటీటీలో విడుద‌ల చేయ‌డానికి నాకెలాంటి అభ్యంత‌రం లేద‌ని కీర్తి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. దాంతో నిర్మాత‌లు ఓటీటీ సంస్థ‌ల‌తో చ‌ర్చ‌లు మొద‌లెట్టారు. ‘మిస్ ఇండియా’ నిర్మాత మ‌హేష్ కోనేరు ఓ ఓటీటీ సంస్థ‌తో సంప్ర‌దింపులు మొద‌లెట్టార‌ని త్వ‌ర‌లోనే ఓటీటీలో ప్ర‌ద‌ర్శితం కానున్న‌ద‌ని వార్త‌లొస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం అవసరం  : రామ్మాధవ్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని..  దాన్ని భర్తీ చేయాలని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి రామ్‌మాధవ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోము వీర్రాజు.. ఏపీ  బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు...

చిరు మాస్టర్ ప్లాన్

ఆచార్య త‌ర‌వాత‌.. భారీ లైన‌ప్ అట్టి పెట్టుకున్నాడు చిరంజీవి. ఓ వైపు బాబీకి ఓకే చెప్పిన చిరు, మ‌రోవైపు మెహ‌ర్ ర‌మేష్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఇంకోవైపు వినాయ‌క్ తో సినిమా చేయ‌డానికి...

అఖిల్ – సురేంద‌ర్ రెడ్డి ఫిక్స్

`సైరా` త‌ర‌వాత సురేంద‌ర్ రెడ్డి ప్రాజెక్టు ఎవ‌రితో అన్న విష‌యంలో గంద‌ర‌గోళం నెల‌కొంది. అగ్ర హీరోలంతా బిజీ బిజీగా ఉండ‌డంతో.. సురేంద‌ర్ రెడ్డికి అనుకోని విరామం తీసుకోవాల్సివ‌చ్చింది. కొంత‌మంది కోసం క‌థ‌లు సిద్ధం...

సచివాలయం గాయబ్..!

దశాబ్దాల పాటు ఉమ్మడి రాష్ట్ర పాలనా కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌ హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న భవనాలు నేలమట్టం అయ్యాయి. మొత్తం పదకొండు భవనాలను నామరూపాల్లేకుండా తొలగించేశారు. శరవేగంగా ఇరవై ఐదు...

HOT NEWS

[X] Close
[X] Close