అంత‌ర్జాతీయ క్రికెట్‌కు ధోనీ గుడ్ బై

ధోనీ రిటైర్‌మెంట్ ఎప్పుడు అనే ప్ర‌శ్న‌కు ఇక తెర‌ప‌డింది. అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి నిష్కమిస్తున్న‌ట్టు ఎం.ఎస్‌.ధోనీ ప్ర‌క‌టించాడు. ఈ మేర‌కు ఇన్‌స్ట్రాగ్రామ్ లో ఓ ప్ర‌క‌ట‌న చేశాడు. ఈ క్ష‌ణం నుంచి తాను రిటైర్ అయిన‌ట్టు భావించాల‌ని పేర్కొన్నాడు. ఇంత కాలం త‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన అభిమానుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. వ‌చ్చే నెల‌లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ లో మాత్రం ధోనీ బ్యాటింగ్ చూడొచ్చు.

కొంత‌కాలంగా.. ధోనీ రిటైర్మెంట్ పై చ‌ర్చ జ‌రుగుతోంది. ధోనీ కూడా అంత‌ర్జాతీయ క్రికెట్ కి దూరంగా ఉంటూ వ‌చ్చాడు. `రిటైర్‌మెంట్ నిర్ణ‌యం అన్న‌ది పూర్తిగా ధోనీకే వ‌దిలేస్తున్నాం` అంటూ విరాట్ కోహ్లీ కూడా చాలాసార్లు మీడియాకు చెప్పాడు. అలానే జ‌రిగింది. ఎలాంటి హ‌డావుడీ లేకుండా, త‌న చివ‌రి అంత‌ర్జాతీయ మ్యాచ్ కూడా ఆడ‌కుండా సైలెంట్ గా గుడ్ బై చెప్పేశాడు ధోనీ. వ‌న్డే కెరీర్ కూడా ఇలానే సింపుల్ గా ముగించాడు. చాలామంది క్రీడాకారులు త‌మ చివ‌రి మ్యాచ్ గుర్తుండిపోయేలా ఉండాల‌ని భావిస్తారు. ప్రేక్ష‌కుల స‌మ‌క్షంలో వీడ్కోలు ప‌లకాల‌ని అనుకుంటారు. కానీ ధోనీ మాత్రం ఎలాంటి ఆర్భాటాల‌కూ పోకుండా గుడ్ బై చెప్పేశాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమిత్‌ షాతో భేటీ కోసం ఢిల్లీకి జగన్..!

ముఖ్యమంత్రిజగన్మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయన పర్యటన హఠాత్తుగా ఖరారయింది. చాలా రోజుల నుంచి ఆయన కేంద్రమంత్రుల్ని కలవాలని అనుకుంటున్నారు. గతంలో రెండు, మూడు సార్లు ఢిల్లీకి వెళ్లిన తర్వాత...

పంపుసెట్లకు మీటర్లను జగన్ ఎందుకు పెడుతున్నారో చెప్పిన హరీష్ రావు..!

వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెడుతున్న వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేపుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు అసంతృప్తితో ఉన్నారు. ఇంకా ప్రక్రియ ప్రారంభం కాలేదు.. ఒక వేళ మీటర్లు పెట్టే ప్రక్రియ ప్రారంభమైతే..రైతులు...

ప్రాయశ్చిత్త హోమాలు చేయాలని ఏపీ సర్కార్‌కు ఆస్థాన స్వామిజీ సలహా..!

ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులు..హిందూత్వంపై వైసీపీ నేతల అరాచక వ్యాఖ్యలకు పరిహారంగా.. ప్రాయశ్చిత్త హోమాలు చేపట్టాలని వైఎస్ జగన్ .. వైసీపీ నేతల ఆస్థాన స్వామిజీ స్వరూపానంద సరస్వతి సూచించారు. వరుస...

రైతులకు ఆ బిల్లులు ఉపయోగపడితే సంబరాలు ఎందుకు చేసుకోరు ?: కేటీఆర్

బిల్లులు ఎలా ఆమోదించుకోవాలో.. ఎలా ప్రజామోదం సంపాదించాలో.. తెలంగాణను చూసి నేర్చుకోవాలని మంత్రి కేటీఆర్ పరోక్షంగా కేంద్ర ప్రభుత్వానికి సలహాలిస్తున్నారు. కేంద్రం వివాదాస్పదంగా ఆమోదించిన వ్యవసాయ బిల్లుల విషయంలో కేటీఆర్ స్పందన.. అంతే...

HOT NEWS

[X] Close
[X] Close