హిట్ 2లో… మ‌రో హీరో కూడా..

విశ్వ‌క్ సేన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం `హిట్`. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి విజ‌యాన్ని అందుకుంది. నిర్మాత‌గా నానికి లాభాలు తెచ్చిపెట్టింది. అదే ఉత్సాహంతో హిట్ 2 ప్ర‌క‌టించాడు నాని. ఈలోగా హిట్ సినిమా బాలీవుడ్ లో తీసే ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయి. దాంతో హిట్ 2 ఉంటుందా, లేదా? అనే అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. పైగా విశ్వ‌క్ సేన్ కూడా వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉండ‌డంతో హిట్ 2 ఆల‌స్యం అవుతుందేమో అనుకున్నారు. అయితే హిట్ 2కి సంబంధించిన ప‌నులు మొద‌లైపోయాయి. స్క్రిప్టు దాదాపుగా పూర్తి కావొచ్చింది. సీక్వెల్ లోనూ… విశ్వ‌క్‌సేన్ నే క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. అయితే. విశ్వ‌క్ తో పాటు ఈ సినిమాలో మ‌రో హీరో కూడా క‌నిపిస్తాడ‌ట‌. ఆ హీరో ఎవ‌ర‌న్న‌ది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌. నానికి అత్యంత స‌న్నిహితంగా ఉండే ఓ యువ క‌థానాయ‌కుడు ఈసినిమాలో న‌టిస్తాడ‌ని, అయితే త‌న‌ది విల‌న్ పాత్ర అని.. స‌మాచారం. సినిమా చివ‌రి వ‌ర‌కూ ఆ హీరో ఎవ‌ర‌న్న‌ది స‌స్పెన్స్ లో ఉంచ‌బోతున్నార్ట‌. మ‌రి ఆ హీరో ఎవ‌రో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పంపుసెట్లకు మీటర్లను జగన్ ఎందుకు పెడుతున్నారో చెప్పిన హరీష్ రావు..!

వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెడుతున్న వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేపుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు అసంతృప్తితో ఉన్నారు. ఇంకా ప్రక్రియ ప్రారంభం కాలేదు.. ఒక వేళ మీటర్లు పెట్టే ప్రక్రియ ప్రారంభమైతే..రైతులు...

ప్రాయశ్చిత్త హోమాలు చేయాలని ఏపీ సర్కార్‌కు ఆస్థాన స్వామిజీ సలహా..!

ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులు..హిందూత్వంపై వైసీపీ నేతల అరాచక వ్యాఖ్యలకు పరిహారంగా.. ప్రాయశ్చిత్త హోమాలు చేపట్టాలని వైఎస్ జగన్ .. వైసీపీ నేతల ఆస్థాన స్వామిజీ స్వరూపానంద సరస్వతి సూచించారు. వరుస...

రైతులకు ఆ బిల్లులు ఉపయోగపడితే సంబరాలు ఎందుకు చేసుకోరు ?: కేటీఆర్

బిల్లులు ఎలా ఆమోదించుకోవాలో.. ఎలా ప్రజామోదం సంపాదించాలో.. తెలంగాణను చూసి నేర్చుకోవాలని మంత్రి కేటీఆర్ పరోక్షంగా కేంద్ర ప్రభుత్వానికి సలహాలిస్తున్నారు. కేంద్రం వివాదాస్పదంగా ఆమోదించిన వ్యవసాయ బిల్లుల విషయంలో కేటీఆర్ స్పందన.. అంతే...

ఏపీలో యాప్‌ ద్వారా పోలీస్ సేవలు..!

ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లకుండా ఫిర్యాదు చేసుకునే ఓ కొత్త వెసులుబాటును ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రత్యేకంగా యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఏపీ పోలీస్‌ సర్వీస్‌ యాప్‌ను...

HOT NEWS

[X] Close
[X] Close