ప్రొ.నాగేశ్వర్ : మూడు దశల పోలింగ్ తర్వాత బీజేపీ డీలా పడిందా..?

దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో… మూడు దశలు ముగిశాయి. ఈ మూడు దశల ఎన్నికల పోలింగ్‌ను విశ్లేషించుకున్న బీజేపీ పెద్దలు..నిరాశకు గురయినట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకూ పోలింగ్ జరిగిన 302 నియోజకవర్గాల్లో బీజేపీకి కనీసం.. వంద కూడా వస్తాయో రావోనన్న సందేహం వారిని వెంటాడుతోందన్న ప్రచారం జరుగుతోంది. తదుపరి జరగబోయే విడతల్లో పూర్తి స్థాయి ఆధిపత్యం ప్రదర్శించకపోతే మళ్లీ అధికారం దక్కడం అనుమానమన్న అంచనాలు ఆ పార్టీ వేసుకుంటున్న చెబుతున్నారు.

బీజేపీకి బలం లేని రాష్ట్రాల్లోనే ఎక్కువగానే పోలింగ్..!

మూడు దశల ఎన్నికలతో బీజేపీ నేతలు డీలా పడ్డారన్నది చెప్పడం సందేహమే. దశవారీగా డీలా పడటం అన్నది ఉండదు. ఎందుకంటే.. ఎన్నికల సంఘం.. ఏడు దశల ఎన్నికలను కేంద్రాన్ని సంప్రదించే నిర్వహిస్తుంది. భద్రతా బలగాల అందుబాటు.. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులపై.. కేంద్ర హోంశాఖతో ఎప్పటికప్పుడు స్పందించి .. ఎన్నికల షెడ్యూల్ రూపొందిస్తుంది. ఇది బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు… ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇదే జరుగుతుంది. పైగా… మొదటి మూడు దశల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి గతంలో వచ్చినది కూడా ఏమీ లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీ గతంలో గొప్ప విజయాలు ఏమీ సాధించలేదు. ఏమైనా అయితే మిత్రపక్షాల సాయం మాత్రం పొందగలదు. ఇప్పుడు జరిగనున్న నాలుగు విడతల రాష్ట్రాల్లో గతంలో బీజేపీ ఘన విజయాలు సాధించింది కాబట్టి.. ఇప్పుడు కూడా.. అలా సాధించడానికి ప్రయత్నాలు చేస్తుంది. అందుకే.. ఓ ప్రణాళిక ప్రకారం.. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో.. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కొత్త కొత్త ప్రచార ప్రణాళికలు, హమీలు బీజేపీ ఇస్తోంది. మోడీతో అక్షయ్ కుమార్ ఇంటర్యూ కూడా ఈ కోణంలోనేది. దీన్ని బుట్టి… బీజేపీ.. చాలా పక్కా ప్రణాళికతో ఒక్కో దశలో ఎన్నికలకు వెళ్తుందని అర్థం చేసుకోవచ్చు.

విడతల వారీగా ప్రణాళికలు అమలు చేస్తున్న బీజేపీ..!

ఏడు దశల ఎన్నికలకు బీజేపీ ప్లాన్ తయారు చేసుకున్నట్లుగాగా ఉంది. ఏడు దశల ఎన్నికల్లో.. ఏ దశ తర్వాత… ఎలాంటి ప్రచారం చేయాలి..? ఎలాంటి నినాదం ఇవ్వాలి..? లాంటివి.. చాలా ఉంటాయి. రాబోయే కాలంలో ఇంకా చాలా ఉంటాయి. అందుకే… మూడు దశల ఎన్నికల తర్వాత డీలాపడటం లాంటివి ఏమీ ఉండవు. రాజకీయాల్లో గెలుపు ఓటములు వస్తూనే ఉంటాయి. ఢిల్లీ, బీహార్‌లలో… బీజేపీ ఓడిపోయింది. డీలా పడిపోలేదు గా..! తర్వాత కూడా పలు రాష్ట్రాలలో విజయం సాదించారు కదా..!. మోడీ .. చాయ్ వాలా ప్రధాని అయ్యాడంటే… చాలా అవరోధాలు అధిగమించి వచ్చి ఉంటారు. మూడుదశల ఎన్నికలను చూసి డీలా పడే పరిస్థితి ఉండదు. అయితే.. తమకు ఏకపక్ష విజయాలు అందించిన రాష్ట్రాల్లో సీట్లు రావు అనుకుంటే.. కచ్చితంగా డీలా పడతారు. యూపీ, మహారాష్ట్ర, గుజరాత్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో సీట్లు రావని తేలితే నిరాశ పడతారు. ఇప్పుడు ఎన్నికలు పూర్తయిన ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడుల్లో.. తమకు ఏదో ఉందని బీజేపీ నేతలు అనుకోరు కదా..!.

హిందీ బెల్ట్‌లో బీజేపీకి వచ్చే ఫలితాలే కీలకం..!

అయితే .. విడతకి.. విడతకి.. ప్రచారవ్యూహాన్ని మార్చుకుంటూ వెళ్లడం సహజం. అన్ని పార్టీలు అలాగే చేస్తూంటాయి. బీజేపీ ఈ విషయంలో మరింత దూకుడుగా ఉంటుంది. ప్రతిపక్షాలను గురి పెట్టి.. కూడా… వారి రాజకీయ వ్యూహం ఉంటుంది. ఇక ముందు జరగనున్న ఎన్నికల్లో పంజాబ్‌లో బీజేపీకి పెద్దగా పట్టు లేదు. అక్కడ కాంగ్రెస్ బలంగా కనిపిస్తోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. కాంగ్రెస్ గెలిచింది. చత్తీస్ ఘడ్‌లో కాంగ్రెస్‌కు మంచి ఫలితాలు వస్తాయి.. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ పుంజుకోవచ్చని అంటున్నారు. ఎందుకంటే.. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో… అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఇష్యూలు వేర్వేరు. ఇప్పుడు బీజేపీ.. మోడీ నినాదం వినిపిస్తున్నారు. మోడీ నే ఓ బ్రాండ్‌గా ప్రచారం చేసి ఎన్నికలకు వెళ్తున్నారు. గతంలో ఈ పరిస్థితి లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com