ఆరు ఫ్లాపుల నుంచి తేజూ ఏం నేర్చుకున్నట్టు…?

తన డబుల్ హ్యాట్రిక్ ఫ్లాపుల గురించి ఎలాంటి మొహమాటం లేకుండా నిజాయతీగా మాట్లాడేస్తున్నాడు తేజూ. అతని తీరు చూస్తే.. తప్పకుండా ఫ్లాపుల నుంచి పాఠాలు నేర్చుకున్నట్టే అనిపించింది. దాంతో చిత్రలహరిపై నమ్మకాలు కూడా పెరిగాయి. కానీ సినిమా చూశాక మాత్రం ఫ్లాపుల పాఠాల్ని సరిగ్గా ఒంటపట్టించుకోలేదేమో అన్న అనుమానం కలగడం ఖాయం. ఎందుకంటే.. చిత్రలహరి ఏమీ గొప్ప కథేం కాదు. కొత్త కథ అస్సలు కాదు. ఇది వరకు ఇలాంటి కథల్ని చాలా చూశాం. అలాంటి రొటీన్ కథ ఎంచుకోవడంతో తేజూ తొలి తప్పు చేసేశాడు.

తేజూ ఈ కథని బలంగా నమ్మడానికి కారణాలు చాలా ఉండొచ్చు. అలాంటివాటిలో మైత్రీ మూవీస్ ఒకటి. ఈ సంస్థ నుంచి సినిమా వస్తోందంటే తప్పకుండా కథాబలం ఉంటుందన్న నమ్మకం ప్రేక్షకులది. తేజూ కూడా గుడ్డిగా అదే ఫాలో అయిపోయాడు. యూత్ పల్స్ పట్టుకుంటాడన్న నమ్మకం కిషోర్ తిరుమలపై ఉండొచ్చు. అయితే ఇది నాని రిజెక్ట్ చేసిన కథన్న సంగతి మాత్రం తేజూ మర్చిపోయాడు. కథ విషయంలో తప్పు చేస్తే.. తెరపై ఎన్ని జిమ్మిక్కులు చేసినా నడవవు. తేజూ నటుడిగా ఈ సినిమాలో భారీ మార్కులతో పాస్ అయ్యాడు. ఆ విషయంలో డౌటు లేదు. కానీ.. తనదైన మార్క్ డాన్సులు మిస్స్ అయ్యాయి. తేజూ ఫ్లాపు సినిమాలోనూ అందుమైన స్టెప్పులు ఉండేవి. వాటిని చూసుకునే అవకాశం మెగా ఫ్యాన్స్ కి దక్కలేదు. కేవలం డాన్సులు ఉంటే సినిమాలు ఆడేస్తాయని కాదు. కనీసం ఫ్యాన్స్ ని థియేటర్లకు రప్పించడానికి అవి కాస్తో కూస్తో పనికొచ్చేవి.

చిత్రలహరి సినిమాకి అరకొర మార్కులు పడడానికి దర్శకుడే కారణం అని ఎవరైనా భావిస్తే అందులో తప్పేం లేకపోవచ్చు. ఎందుకంటే నావల్టీ లేని పాయింట్ పట్టుకుని రెండున్నర గంటలు కూర్చోబెట్టాలనుకోవడం సాహసం. కాకపోతే… ఇక్కడ తేజూ చెప్పే మాట ఒకటి గుర్తు పెట్టుకోవాలి. `నా సినిమాల బాధ్యత నాదే. ఎందుకంటే కథ ఓకే చేసేది నేనే కాబట్టి. నేను నో.. అంటే.. ఆ సినిమా నేనెలా చేస్తా?` అంటుంటాడు తేజూ. మరి.. ఇంత సాదాసీదా కథ ఎంచుకున్న తేజూ మళ్లీ అదే తప్పు ఎందుకు చేసినట్టో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నీల‌కంఠ‌తో రాజ‌శేఖ‌ర్‌

షో సినిమాతో ఆక‌ట్టుకున్నాడు నీల‌కంఠ‌. మిస్స‌మ్మ త‌న‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ప‌లు అవార్డులు అందించింది. దాంతో క్లాస్ ద‌ర్శ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా కాలంగా నీల‌కంఠ ఖాళీగా ఉన్నాడు. అయితే.. ఇప్పుడు...

అపెక్స్ భేటీలో ఏపీ, కేంద్రం నోళ్లు మూయిస్తాం: కేసీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. స్నేహహస్తం చాచినా.. కావాలని కయ్యం పెట్టుకుంటోందని మండిపడ్డారు. ఈ విషయంలో కేంద్ర విధానాలు కూడా సరిగ్గా లేవన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిని...

13 నెలల్లో 13 జిల్లాలకు ఏం చేశారో చెబుతారా..?: చంద్రబాబు

ఐదేళ్ల పాలనలో 13 జిల్లాలకు తెలుగు దేశం హయాంలో ఏం చేశామో.. ఎలా అభివృద్ది వికేంద్రీకరణ చేశామో... టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాకు వివరించారు. పదమూడు నెలల్లో...వైసీపీ సర్కార్ ఏం చేసిందో...

మీడియా వాచ్‌: తీవ్ర సంక్షోభంలో ‘ఈనాడు’

తెలుగులో అగ్ర‌గామి దిన‌ప‌త్రిక ఈనాడు. ద‌శాబ్దాలుగా నెంబ‌ర్ వ‌న్‌గా చ‌లామణీ అవుతోంది. అయితే... క‌రోనా నేప‌థ్యంలో నెంబ‌ర్ వ‌న్ సంస్థ సైతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. క‌రోనా ఉప‌ద్ర‌వానికి ముందు ఈనాడు...

HOT NEWS

[X] Close
[X] Close