వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు చుట్టూ కారణాలేమిటన్నదానిపై.. సోషల్ మీడియాలో… రెండు వర్గాలు విస్తృతమైన వాదోపవాదాలకు దిగుతున్నాయి. ఈ వర్గాలకు రాజకీయాలతో సంబంధం లేకపోయినా.. పాత, కొత్త ఫోటోలను.. షేర్ చేస్తూ.. తమ వాదనకు మద్దతు చూపిస్తున్నాయి. ఇంతకీ ఆ రెండు వర్గాల మధ్య జరుగుతున్న సంవాదం ఏమిటంటే.. జగన్ హిందూత్వం తీసుకున్నాడా.. ? లేదా..? అనేదే..!
జగన్ మతం మార్చుకున్నారన్న ప్రచారంలో వాస్తవం ఎంత..?
“బైబిల్ విసిరికొట్టాడు… భగవద్గీత చేతబట్టాడు.. అందుకే జగన్మోహన్ రెడ్డికి విజయం లభించింది…”.. మే 23వ తేదీ నుంచి..సోషల్ మీడియాలోని కొన్ని హిందూత్వ గ్రూపుల్లో విస్తృతంగా ప్రచారమవుతున్న అంశం ఇది. దీనికి మద్దతుగా జగన్.. మతం మార్చుకున్నాడంటూ.. శాస్త్రోక్తంగా జరిగిన కొన్ని కార్యక్రమాల ఫోటోలను… సాక్ష్యంగా చూపిస్తున్నారు. ఆ ఫోటోల్లో… అచ్చంగా.. జగన్మోహన్ రెడ్డి మతమార్పిడి చేసుకుంటున్నట్లుగా… వ్యవహారం ఉంది. ఆ కార్యక్రమాన్ని హృషికేష్లో… స్వరూపనంద స్వామి ఆధ్వర్యంలో జరిగిందని… రాసుకొచ్చారు.
తనకు బైబిలే దైవమని ఇంగ్లీష్ మీడియాకు చెప్పారు కదా..!
అయితే.. వెంటనే మరో గ్రూప్ దానికి కౌంటర్ ఇవ్వడం ప్రారంభించింది. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీని ఎప్పుడూ వదులుకునే అవకాశమే లేదని.. ఆయన హిందూత్వాన్ని నమ్మరని.. ఎప్పుడూ దేవుడి గురించి ప్రస్తావించేది.. జీసస్ గురించేనని.. ఓ గ్రూప్ సాక్ష్యాలు పోస్ట్ చేస్తోంది. ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూల్లో.. తాను రోజూ బైబిల్ చదువుతానని… క్రైస్తవాన్ని మనసా వాచా ఆచరిస్తానని .. జగన్మోహన్ రెడ్డి చెప్పిన దృశ్యాలను సాక్ష్యంగా పెడుతున్నారు. ఈ రెండు గ్రూపుల సంవాదం… సాధారణ ప్రజల్లోకి కూడా.. వచ్చే పరిస్థితి ఏర్పడింది.
జగన్ కేంద్రంగా జరుగుతున్న ప్రచారానికి ఎలా పులిస్టాప్ పడాలి..!
మరో వైపు జగన్మోహన్ రెడ్డి… ప్రమాణస్వీకారానికి ముందుగా… అటు జీసస్‌ను.. అటు అల్లాను.. చివరిగా.. శ్రీవెంకటేశ్వరుడ్ని కూడా దర్శించుకుని.. పూజలు చేసి రాబోతున్నారు. పాలకుడు ఎప్పుడూ కులమతాలకు అతీతంగానే వ్యవహరించాలి. అలా అని అయన మత విశ్వాసాలను దాచుకోవాల్సిన పని లేదు. ఎవరి నమ్మకం వారిది. వివక్ష చూపించకపోతే చాలు. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు బాధ్యత ఉంది. అయితే.. ఆయన కేంద్రం జరుగుతున్న మత రచ్చ మాత్రం రాజకీయానికి అంత మంచిది కాదు. చెప్పాల్సిందేదో చెప్పి.. ఆయన ఈ చర్చకు పులిస్టాప్ పెట్టకపోతే.. రాజకీయాలు గతి తప్పే ప్రమాదం కూడా ఉంది.