పోలవరం బాధ్యత ఏపీదే..! కేంద్రం తీసుకోదట..!

విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన ప్రయోజనం ఏదైనా ఉంది అంటే.. అది పోలవరం ప్రాజెక్ట్ మాత్రమే. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి… పోలవరాన్ని ఏపీకి వరంగా ఇచ్చారు. జాతీయ ప్రాజెక్టు అంటే.. కేంద్రమే ఆ ప్రాజెక్టును నిర్మించాలి. 90 శాతం ఖర్చు కేంద్రం పెట్టుకోవాలి. పది శాతం రాష్ట్ర ప్రభుత్వానిది. అయితే ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా.. ఆ పది శాతం కూడా కేంద్రమే భరించేలా రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగింది. దాంతో ఒక్క రూపాయి కూడా… రాష్ట్రం భరించాల్సిన పనిలేదు.

పోలవరంకు కేంద్రం నిధులు ఎప్పుడు ఇస్తుంది..?

కేంద్ర బాధ్యత అయిన పోలవరం… నిర్మాణం… కేంద్ర సంస్థలు తీసుకుంటే … ఆలస్యం అవుతుందన్న ఉద్దేశంతో.. నీతి అయోగ్ సిఫార్సు మేరకు.. ఏపీ ప్రభుత్వానికి అప్పగించారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తయితే… కావాల్సిందేముందని.. చంద్రబాబు ప్రాజెక్ట్‌ను తీసుకున్నారు. ముందుగా.. ఖర్చు పెట్టి… ఆ తర్వాత ఖర్చులు రీఎంబర్స్ చేసుకునేదానికి అంగీకరించారు. ఆ ప్రకారం పనులు పరుగులు పెట్టించారు. మూడేళ్లలో 70 శాతం పూర్తయింది. ఇంకా 30 శాతం మిగిలి ఉంది.అయితే.. ఇది కాంక్రీట్ వర్క్ మాత్రమే . ప్రాజెక్టు నిర్మాణపరంగా పూర్తవుతుంది. కానీ నీళ్లు నిల్వచేయాలంటే.. ముంపు ప్రాంతాలన్నింటికీ పరిహారం ఇచ్చి ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడీ ఖర్చు ఎవరిదన్నదే… అంతుబట్టకుండా ఉంది. కేంద్ర ప్రభుత్వం.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ గురించి మాట్లాడకుండా మిగతా విషయాలు మాత్రం.. మాట్లాడుతోంది.

నిర్మాణం ఏపీకి అవసరం లేదన్న జగన్..! ఏపీనే చూసుకోవాలంటున్న కేంద్రం..!

అందుకే.. ఏపీకి కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి తన మొదటి ఢిల్లీ పర్యటనలోనే.. పోలవరం ప్రాజెక్ట్‌పై కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అదేమిటంటే.. పోలవరం నిర్మాణం కొనసాగించాల్సిన అవసరం ఏపీకి లేదని తేల్చి చెప్పేశారు. అయితే.. ప్రాజెక్టు నిర్మాణం మాత్రం యుద్ధప్రాతిపదికన పూర్తి కావాల్సి ఉందన్నారు. అంటే.. ఏపీకి సంబంధం లేకుండానే.. ప్రాజెక్టు నిర్మాణం కావాలని ఆయన అనుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో… కష్టసాధ్యం అని జగన్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఆ ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించేస్తే.. తనకు సమస్య ఉండదని భావించినట్లు తెలుస్తోంది. అందుకే.. కేంద్రం జోక్యం కోరుతామని.. జగన్ చెప్పినా… పోలవరం ప్రాజెక్ట్ ఆథారిటీ మాత్రం… భిన్నమైన ప్రకటన చేసింది. రాష్ట్రం ఆధ్వర్యంలోనే… ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతుందంటున్నారు.

జగన్మోహన్ రెడ్డి బలహీనతో కేంద్రం మొదటి దెబ్బకొట్టిందా..?

ఇప్పటికే.. పోలవరానికి సంబంధించి ఏపీకి కేంద్రం నుంచి.. దాదాపుగా రూ. 6,800 కోట్లు రావాల్సి ఉంది. అయితే.. రెండు వేల కోట్లు మాత్రమేనేనని పీపీఏ ఛైర్మన్ స్పష్టంగా చెప్పారు. మిగతా సొమ్ముల గురించి తమకు తెలియదనేశారు. అంటే.. వాటిని ఇక అడగకూడదన్నమాట. పైగా… ప్రాజెక్టును… పరుగులు పెట్టించాల్సిన బాధ్యత… రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంది. ఏ మాత్రం ఆలస్యం అయినా… ప్రాజెక్టు నిర్మాణం వెనుకబడిపోతుంది. అదే జరిగితే.. మళ్లీ.. మళ్లీ అంచనాలు పెరిగిపోతాయి. నిర్మాణం చేయడం కష్టమవుతుంది. ఇప్పటికే 70 శాతం పూర్తయిన ప్రాజెక్టును ఆ కొంత శాతం కూడా పూర్తి చేయకపోతే.. జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఇబ్బంది ఎదురవుతుంది. అదే సమయంలో.. ప్రాజెక్టు కోసం నిధులు ఇవ్వాలని పట్టుబట్టే పరిస్థితి లేదు. ఇస్తే తీసుకోవాలి. లేకపోతే.. ఇచ్చే వరకూ.. “ప్లీజ్ సార్.. ప్లీజ్ సార్..” అని బతిమాలుకోవాలి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డిని పోలవరం విషయంలో కేంద్రం మొదటగా ఇరికించేసిందనే చెప్పుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close