తమ్మినేని అలా.. షరీఫ్ ఇలా..!

మంగళవారం అటు అసెంబ్లీలో.. ఇటు శాసనమండలిలో.. రెండు భిన్నమైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యారు. అమరావతిపై మాట్లాడే అవకాశం ఇవ్వాలని.. టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తే.. దానికే స్పీకర్ తమ్మినేని సీతారాం.. హెడ్ ఫోన్స్ విసిరికొట్టి.. తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వెళ్లిపోయారు. అదే మండలిలో… పధ్నాలుగు మంది మంత్రులు అదీ కూడా మండలిలో సభ్యులు కాని వారు వచ్చి పోడియాన్ని చుట్టుముట్టినా.. చైర్మన్ షరీఫ్ ఎక్కడా సంయమనాన్ని కోల్పోలేదు. అందరికీ.. సర్ది చెప్పడానికే ప్రయత్నించారు. ఆయన నోటి నుంచి ‌అనవసరంగా ఒక్క పదం బయటకు రాలేదు. ఎక్కడా సభ్యులపై అసహనం చూపించలేదు. మంత్రులు కటువుగా తనపై చేసిన వ్యాఖ్యలను.. కూడా…సున్నితంగానే ఖండించారు. తనకు రాజకీయాలు ఆపాదించవద్దన్నారు.

మండలి ఛైర్మన్ షరీఫ్ సభను నడిపిన తీరు.. స్పీకర్‌గా తమ్మినేని సీతారాం వ్యవహారశైలి పోలిక రావడంతో సామాన్యుల్లోనూ చర్చ ప్రారంభమయింది. ఆరు సార్లు గెలిచి..మూడు సార్లు మంత్రి అయిన తమ్మినేని.. స్పీకర్‌గా మాత్రం ఆ స్థాయి అనుభవాన్ని ప్రదర్శించడం లేదు.  సభలో తెలుగుదేశం సభ్యులకు మాట్లాడేందుకు తగిన అవకాశం ఇవ్వడం లేదన్న ఆరోపణలను ఆయన తరచూ ఎదుర్కొంటున్నారు.  నిజానికి తమకు సరైన అవకాశం రాని సందర్భంలో విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేస్తారు. ఏపీ అసెంబ్లీలో మాత్రం విచిత్రంగా స్పీకర్ బైటకు వెళ్లిపోయారు. అంతకు ముందు రోజు..  ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరిపించాలని.. ముఖ్యమంత్రి జగన్‌ను నేరుగా ఆదేశించారు. ఇది కూడా వివాదాస్పదమయింది.

ఇక బయట ఆయన మాట్లాడుతున్న మాటలు.. మరింత వివాదాస్పదమవుతున్నాయి. అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ ను అదే పనిగా వాడుతున్నారు. దీనిపై విమర్శలు వస్తే… తాను ముందు ఎమ్మెల్యేనని..మరోకటని.. కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు.. శాసనమండలిలో చైర్మన్ షరీఫ్.. వ్యవహరిస్తున్న తీరు.. తమ్మినేని వ్యవహారిస్తున్న  ఒకే సారి హైలెట్ కావడంతో..  శాసనసభాపతికి మైనస్ మార్కులు పడుతున్నాయి. షరీఫ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బాస్5: యాంకర్ రవి ఎలిమినేషన్ రచ్చ, మద్దతుగా బిజెపి ఎమ్మెల్యే

బిగ్ బాస్ సీజన్ 5 లో తాజా ఎపిసోడ్ లో యాంకర్ రవి ని ఎలిమినేట్ చేయడం చర్చకు దారి తీసింది. యాంకర్ రవి అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద నిరసన తెలపడం,...

అమరావతి రైతులకు వైసీపీ ఎమ్మెల్యే మద్దతు..!

అమరావతి రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు, టీడీపీ కార్యకర్తలుగా చెప్పడమే వైసీపీ ఎమ్మెల్యేల విధానం. వారి పట్ల కనీస సానుభూతి చూపినా వైసీపీ హైకమాండ్‌కు వచ్చే ఆగ్రహాన్ని తట్టుకోవడం కష్టం. అయితే నెల్లూరు రూరల్...

‘ఆచార్య‌’ని మ‌ళ్లీ రేసులోకి తెచ్చిన సిద్ధ‌

ఆచార్య‌.... చిరంజీవి - కొర‌టాల కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న సినిమా. ఎప్పుడో విడుద‌ల కావాల్సింది. కానీ ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఇది చిరంజీవి సినిమా. పైగా అప‌జ‌యం అంటూ ఎరుగ‌ని...
video

బింబిసార టీజ‌ర్‌: ఖ‌డ్గ వీరుడి క‌థ‌

https://youtu.be/xF9UimAv3Kw విజ‌య‌మో, వైఫ‌ల్య‌మో - ఏదీ ప‌ట్టించుకోకుండా ప్ర‌యోగాల చేస్తూనే వెళ్తుంటాడు క‌ల్యాణ్ రామ్‌. కొత్త క‌థ‌ల్ని తెర‌కెక్కించ‌డం అంటే త‌న‌కు భ‌లే స‌ర‌దా. `బింబిసార‌` కూడా అలాంటి ప్ర‌య‌త్న‌మే. వ‌శిష్ట్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న...

HOT NEWS

[X] Close
[X] Close