ఆ ముగ్గుర్నీ ద‌త్త‌త తీసుకున్న దిల్ రాజు

ఇటీవ‌ల ఆత్మ‌కూరులో త‌ల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథ‌లైన ముగ్గురు ప‌సి వాళ్ల క‌థ‌… తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల్ని క‌ల‌చివేసింది. వీళ్ల‌ని ఆదుకోవాల‌ని ఛాన‌ళ్లు ప్ర‌త్యేక క‌థ‌నాల్ని ప్ర‌సారం చేశాయి. ఆ ఛాన‌ళ్ల కృషి ఫ‌లించింది. ఇప్పుడు ఆ ప‌సి హృద‌యాల‌కు స‌హాయం చేయ‌డానికి, వాళ్ల జీవితాల్లో వెలుగు నింప‌డానికి నిర్మాత దిల్ రాజు ముందుకు వ‌చ్చారు. ఆ ముగ్గుర్నీ ద‌త్త‌త తీసుకుంటున్న‌ట్టు దిల్ రాజు ప్ర‌క‌టించారు. “మ‌నోహ‌ర్, లాస్య‌, య‌శ్వంత్ ల‌ను నా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాను. ఇక నుంచి వాళ్ల బాధ్య‌త నాది. ఈ విష‌యంలో నాకు స‌హ‌క‌రించిన మంత్రి య‌ర్ర‌బెల్లి ద‌యాక‌ర రావుకి కృత‌జ్ఞ‌త‌లు“ అంటూ ట్విట్ట‌ర్ లో ఓ ప్ర‌క‌ట‌న చేశారు దిల్ రాజు. ఇటీవ‌లే దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. కొత్త జీవితం ప్రారంభించిన దిల్ రాజు – ఇప్పుడు ఓ మంచి ప‌నితో మ‌రో ముగ్గురికీ కొత్త జీవితం అందించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్‌కు గుడి కాదు చర్చి కట్టాలన్న ఆర్ఆర్ఆర్..!

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ముఖ్యమంత్రి జగన్ కు గుడి కట్టడానికి ఏర్పాట్లు చేయడం.. భూమి పూజ చేయడం వివాదాస్పదమవుతోంది. ఖచ్చితంగా అయోధ్య రామాలయానికి శంకుస్థాపన జరుగుతున్నప్పుడే.. తలారి...

మంచు వారి ‘ఓటీటీ’

ప్ర‌తీ సినీ కుటుంబానికీ ఓ నిర్మాణ సంస్థ ఉండ‌డం ఎంత స‌హ‌జంగా మారిందో, ఇప్పుడు ఓ ఓటీటీ సంస్థ ఉండ‌డం కూడా అంతే రివాజుగా మార‌బోతోంది. ఓటీటీ సంస్థ‌ల ప్రాధాన్యం క్ర‌మంగా పెరుగుతోంది....

వార‌సుడిపై దృష్టి పెట్టిన బాల‌య్య‌

లాక్ డౌన్ లో స్టార్లంతా ఇంటికే ప‌రిమితం అయ్యారు. వివిధ ర‌కాల వ్యాపాల‌తో బిజీగా మారారు. బాల‌కృష్ణ కూడా అంతే. అయితే ఈ విరామాన్ని ఆయ‌న త‌న వార‌సుడి కోసం కేటాయించారు. మోక్ష‌జ్ఞ...

క‌థ‌ల కోసం యూవీ అన్వేష‌ణ‌

యూవీ క్రియేష‌న్స్ పేరు చెప్ప‌గానే సాహో, రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రాలు గుర్తొస్తాయి. అయితే ప్ర‌స్తుతం యూవీ చిన్న సినిమాల‌వైపు దృష్టి పెట్టింది. ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాల్ని ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉంది....

HOT NEWS

[X] Close
[X] Close