మ‌రో కాంట్ర‌వ‌ర్సీ ‘అల్లు’తున్నాడు

మెగా ఫ్యామిలీని ఇప్ప‌ట్లో వ‌దిలేట్టు లేడు వ‌ర్మ‌. ఈమ‌ధ్యే ప‌వ‌ర్ స్టార్ అనే సినిమాతీసి, అందులో ప‌వ‌న్‌, చిరు, నాగ‌బాబు పాత్ర‌ల్ని వాడేసుకున్నాడు. ఇప్పుడు అల్లు అర‌వింద్‌పై ప‌డ్డాడు. `అల్లు` పేరుతో ఓ సినిమా (షార్ట్ ఫిల్మ్ లాంటిదే) తీస్తున్నాడు వ‌ర్మ‌. అల్లు అన‌గానే.. ఎవ‌రు గుర్తుకు వ‌స్తారో, ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ టైటిల్ కి వ‌ర్మ జ‌స్టిఫికేష‌న్ కూడా ఇచ్చేస్తున్నాడు.

“అల్లు” అనే టైటిల్ ఎందుకు పెట్టామంటే ఇందులోని మెయిన్ క్యారెక్టర్ రకరకాల ప్లాన్స్ “అల్లు”తూ వుంటాడు. తనకి మంచి జరగాలి అంటే ప్లాన్ అల్లు, మరొకడికి చెడు జరగాలి అంటే ప్లాన్ అల్లు అనే స్ట్రాటర్జీ తో ప్లాన్ ల అల్లుడు లో ఆరితేరిపోయి, పెద్ద స్టార్ అయిన తన బావ పక్కనే ఉంటూ తన మైలేజీ పడిపోకుండా ఉండటానికి తమ ఇంటి “అల్లు”డు అని కూడా మర్చిపోయి ఎప్పటికప్పుడు ప్లాన్లు అల్లుతూ వుంటాడు. అందరితో తనని “ఆహా” అనిపించుకోవటానికి తనకి కావాల్సిన వాళ్ళకే మంచి జరిగేలా చెప్పి ప్లాన్ ల మీద ప్లాన్ అల్లుకుపోతూ ఉండే ఒక పెద్ద అల్లికల మాస్టర్ కథే ఈ అల్లు..“ అంటూ ట్విట్ట‌ర్ లో రెచ్చిపోయాడు.

ప్ర‌జారాజ్యం స‌మ‌యంలో తెర వెనుక అల్లు అర‌వింద్ న‌డిపించిన పాత్ర అంతా ఇంతా కాదు. ఇప్పుడు `అల్లు`కి క‌థా వ‌స్తువు కూడా అదే. మ‌రి ఈ సినిమాతో వ‌ర్మ ఇంకెన్ని కొత్త వివాదాల్ని అల్లుకుపోతాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.


Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్‌కు గుడి కాదు చర్చి కట్టాలన్న ఆర్ఆర్ఆర్..!

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ముఖ్యమంత్రి జగన్ కు గుడి కట్టడానికి ఏర్పాట్లు చేయడం.. భూమి పూజ చేయడం వివాదాస్పదమవుతోంది. ఖచ్చితంగా అయోధ్య రామాలయానికి శంకుస్థాపన జరుగుతున్నప్పుడే.. తలారి...

మంచు వారి ‘ఓటీటీ’

ప్ర‌తీ సినీ కుటుంబానికీ ఓ నిర్మాణ సంస్థ ఉండ‌డం ఎంత స‌హ‌జంగా మారిందో, ఇప్పుడు ఓ ఓటీటీ సంస్థ ఉండ‌డం కూడా అంతే రివాజుగా మార‌బోతోంది. ఓటీటీ సంస్థ‌ల ప్రాధాన్యం క్ర‌మంగా పెరుగుతోంది....

వార‌సుడిపై దృష్టి పెట్టిన బాల‌య్య‌

లాక్ డౌన్ లో స్టార్లంతా ఇంటికే ప‌రిమితం అయ్యారు. వివిధ ర‌కాల వ్యాపాల‌తో బిజీగా మారారు. బాల‌కృష్ణ కూడా అంతే. అయితే ఈ విరామాన్ని ఆయ‌న త‌న వార‌సుడి కోసం కేటాయించారు. మోక్ష‌జ్ఞ...

క‌థ‌ల కోసం యూవీ అన్వేష‌ణ‌

యూవీ క్రియేష‌న్స్ పేరు చెప్ప‌గానే సాహో, రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రాలు గుర్తొస్తాయి. అయితే ప్ర‌స్తుతం యూవీ చిన్న సినిమాల‌వైపు దృష్టి పెట్టింది. ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాల్ని ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉంది....

HOT NEWS

[X] Close
[X] Close