మోహ‌న్‌బాబు ఇంట్లో చొర‌బ‌డ్డ అగంత‌కుల‌ అరెస్ట్‌

శుక్ర‌వారం రాత్రి హైద‌రాబాద్ లోని మోహ‌న్ బాబు ఇంట్లోకి కొంత‌మంది దుండ‌గులు చొర‌బ‌డ్డారు. జూబ్లీ హిల్స్ లోని మోహ‌న్ బాబు ఇంటిలోకి వ‌చ్చి… `నీ అంతు చూస్తాం..` అంటూ వార్నింగ్ ఇచ్చి అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు. దీంతో భ‌యాందోళ‌న‌కు చెందిన మోహ‌న్ బాబు, కుటుంబ స‌భ్యులు అగంత‌కుల‌పై మోహ‌న్ బాబు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆ దుండ‌గుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా… పోలీసులు దుండ‌గుల్ని ఈజీగా ప‌ట్టుకోగ‌లిగారు.

వీళ్లంతా మైలార్ దేవ్ ప‌ల్లి, దుర్గా న‌గ‌ర్ కి చెందిన‌వాళ్ల‌ని పోలీసులు గుర్తించారు. వీళ్ల‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ప్ర‌స్తుతం వీళ్ల కాల్ డేటాని ప‌రిశీలిస్తున్నారు పోలీసులు. మోహ‌న్ బాబు ఇంటికి వెళ్లి బెదిరించ‌మ‌ని ఎవ‌రైనా పుర‌మాయించారా? లేదంటే వీళ్ల‌కు వీళ్లుగా వెళ్లారా? అగంతుకుల నేప‌థ్యం ఏమిటి? ఇలాంటి విష‌యాల్ని ఆరా తీస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంచు వారి ‘ఓటీటీ’

ప్ర‌తీ సినీ కుటుంబానికీ ఓ నిర్మాణ సంస్థ ఉండ‌డం ఎంత స‌హ‌జంగా మారిందో, ఇప్పుడు ఓ ఓటీటీ సంస్థ ఉండ‌డం కూడా అంతే రివాజుగా మార‌బోతోంది. ఓటీటీ సంస్థ‌ల ప్రాధాన్యం క్ర‌మంగా పెరుగుతోంది....

వార‌సుడిపై దృష్టి పెట్టిన బాల‌య్య‌

లాక్ డౌన్ లో స్టార్లంతా ఇంటికే ప‌రిమితం అయ్యారు. వివిధ ర‌కాల వ్యాపాల‌తో బిజీగా మారారు. బాల‌కృష్ణ కూడా అంతే. అయితే ఈ విరామాన్ని ఆయ‌న త‌న వార‌సుడి కోసం కేటాయించారు. మోక్ష‌జ్ఞ...

క‌థ‌ల కోసం యూవీ అన్వేష‌ణ‌

యూవీ క్రియేష‌న్స్ పేరు చెప్ప‌గానే సాహో, రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రాలు గుర్తొస్తాయి. అయితే ప్ర‌స్తుతం యూవీ చిన్న సినిమాల‌వైపు దృష్టి పెట్టింది. ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాల్ని ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉంది....

చుండూరు దళితుల ఊచకోతకు 29 ఏళ్లు..! న్యాయం ఎప్పటికి..?

అది ఓ పచ్చని పల్లె. కానీ ఓ రోజు అక్కడి పంట కాలవల గోతాల్లో శవాలు బయటపడ్డాయి. ముక్కలు ముక్కలుగా నరికి గోతాల్లో కుక్కి అక్కడ పడేశారు. అందరూ దళితులు. మొత్తంగా ఎనిమిదిని...

HOT NEWS

[X] Close
[X] Close