కర్నూలు రాజధాని డిమాండ్‌కు మరింత ఊపు..!

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా కర్నూలు ఉండాలనే డిమాండ్ అంతకంతకూ ఊపందుకుంటోంది. వైసీపీ నేతలు కూడా.. ఈ డిమాండ్‌ను.. మూడు రాజధానుల అంశం తెరపైకి తీసుకు వచ్చినప్పుడు వినిపించారు. ఇప్పుడు.. రాజధాని తరలింపు ఖాయమయింది. ప్రతీ పనికి .. పార్టీలకు అతీతంగా నేతలందరూ.. సెక్రటేరియట్‌కు వెళ్లాల్సిందే. అలా వెళ్లాంటే.. విశాఖ వెళ్లాలి. విశాఖలో ఎయిర్ పోర్టు ఉన్నా.. రాయలసీమలో మాత్రం.. ఇంకా ఎయిర్ కనెక్టివిటీ పెరగలేదు. కడప, కర్నూలుల్లో విమానాశ్రయాలున్నా… ఆదరణ లేక.. ఫ్లైట్లు కూడా తిరగడం లేదు. ఒక వేళ సర్వీసులు ఎక్కువగా ఏర్పాటు చేసినా… పనుల కోసం వెళ్లాలనుకువారందరూ విమానాల్లో ప్రయాణించలేరు. అదే… విజయవాడ లేదా అమరావతి అయితే.. సీమలోని ఏ జిల్లా నుంచి అయినా ఐదారు గంటల్లో వెళతారు. ఇప్పుడు.. కనీసం పద్దెనిమిది గంటల సమయం వెచ్చించాల్సి ఉంటుంది.

అదే సమయంలో.. తమకు రాజధాని దూరం అయిందనే భావనతో పాటు… తమ ప్రాంతం మరింత నిర్లక్ష్యానికి గురవుతుందేమోనన్న ఆలోచన వారిలో పెరుగుతోంది. చట్టంలో కర్నూలులో హైకోర్టు పెట్టాలనే ఆలోచన చేసినప్పటికీ.. అది అంత తేలికగా సాకారం అయ్యే అవకాశాలు లేవంటున్నారు. ఎందుకంటే… రాష్ట్రంలో చట్టం చేసినంతనే హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయలేరు. దానికో ప్రక్రియ ఉంటుంది. అది హైకోర్టు నుంచే ప్రారంభం కావాలి. రాష్ట్రపతి నోటిఫికేషన్‌తో పూర్తవ్వాలి. అది అంత సామాన్యంగా పూర్తయ్యేది కాదు. శరవేగంగా జరిగితేనే.. మూడేళ్లు పడుతందంటున్నారు. ప్రస్తుత కరోనా కాలంలో… ఆ ప్రక్రియ ఇప్పుడల్లా ముందుకు సాగే అవకాశం లేదు.

ఇప్పటికి కర్నూలు రాజధానిని నేతలే డిమాండ్ చేస్తున్నప్పటికీ… ఓ సారి పరిపాలనా రాజధాని విశాఖకు మారిన తర్వాత సాధారణ ప్రజల్లోనూ.. అదే డిమాండ్ వినిపించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనుభవమైతేనే కానీ తత్వం బోధపడదన‌్నట్లుగా… రాజధానిని ఓ మూలకు తరలిస్తే.. వచ్చే ఇబ్బందులు ప్రజలకు భరించడం ప్రారంభించిన తర్వాతే.. అసలు రియాక్షన్… ప్రజల్లో వస్తుందన్న అభిప్రాయం కూడా ఉంది. దీన్ని రాజకీయ నేతలు మరింతగా పెంచుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్‌కు గుడి కాదు చర్చి కట్టాలన్న ఆర్ఆర్ఆర్..!

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ముఖ్యమంత్రి జగన్ కు గుడి కట్టడానికి ఏర్పాట్లు చేయడం.. భూమి పూజ చేయడం వివాదాస్పదమవుతోంది. ఖచ్చితంగా అయోధ్య రామాలయానికి శంకుస్థాపన జరుగుతున్నప్పుడే.. తలారి...

మంచు వారి ‘ఓటీటీ’

ప్ర‌తీ సినీ కుటుంబానికీ ఓ నిర్మాణ సంస్థ ఉండ‌డం ఎంత స‌హ‌జంగా మారిందో, ఇప్పుడు ఓ ఓటీటీ సంస్థ ఉండ‌డం కూడా అంతే రివాజుగా మార‌బోతోంది. ఓటీటీ సంస్థ‌ల ప్రాధాన్యం క్ర‌మంగా పెరుగుతోంది....

వార‌సుడిపై దృష్టి పెట్టిన బాల‌య్య‌

లాక్ డౌన్ లో స్టార్లంతా ఇంటికే ప‌రిమితం అయ్యారు. వివిధ ర‌కాల వ్యాపాల‌తో బిజీగా మారారు. బాల‌కృష్ణ కూడా అంతే. అయితే ఈ విరామాన్ని ఆయ‌న త‌న వార‌సుడి కోసం కేటాయించారు. మోక్ష‌జ్ఞ...

క‌థ‌ల కోసం యూవీ అన్వేష‌ణ‌

యూవీ క్రియేష‌న్స్ పేరు చెప్ప‌గానే సాహో, రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రాలు గుర్తొస్తాయి. అయితే ప్ర‌స్తుతం యూవీ చిన్న సినిమాల‌వైపు దృష్టి పెట్టింది. ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాల్ని ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉంది....

HOT NEWS

[X] Close
[X] Close