‘వ‌కీల్ సాబ్’… రీ రిలీజ్‌?!

ప‌వ‌న్ క‌ల్యాణ్ దాదాపుగా మూడేళ్ల సుదీర్ఘ విరామం త‌ర‌వాత చేసిన సినిమా.. వ‌కీల్ సాబ్. ప‌వ‌న్ స్క్రీన్ ప్రెజెన్స్‌, కోర్టు రూమ్ డ్రామా బాగా పండాయి. తొలి మూడు రోజుల వ‌సూళ్లు కుమ్మేశాయి. ఇక వ‌కీల్ సాబ్ రికార్డు వ‌సూళ్లు గ్యారెంటీ అనుకుంటున్న ద‌శ‌లో.. క‌రోనా సెకండ్ వేవ్ బాక్సాఫీసుని ముంచేసింది. థియేట‌ర్ల మూత వ‌ల్ల‌… వ‌కీల్ సాబ్ జోరు అర్థాంత‌రంగా ఆగిపోయింది. అయితే ఇప్పుడు వ‌కీల్ సాబ్ ని మ‌ళ్లీ రీ – రిలీజ్ చేయాల‌ని దిల్ రాజు భావిస్తున్న‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే థియేట‌ర్లు మ‌ళ్లీ తెర‌చుకుంటాయ‌న్న సంకేతాలు చిత్ర‌సీమ‌కు అందుతున్నాయి. తెలంగాణా, ఆంధ్రల‌లో ఈ నెలాఖ‌రుకి లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. జులై ద్వితీయార్థంలో థియేట‌ర్లు తెర‌చుకోవొచ్చు. అప్ప‌టిక‌ప్పుడు విడుద‌ల చేయ‌డానికి సినిమాలు సిద్ధంగా ఉండ‌క‌పోవొచ్చు. అందుకే `వ‌కీల్ సాబ్`ని రంగంలోకి దించి, మ‌ళ్లీ జ‌నాల‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించాల‌ని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.

క‌నీసం 300 థియేట‌ర్ల‌లో అయినా, వ‌కీల్ సాబ్ ని విడుద‌ల చేయాల‌న్న‌ది దిల్ రాజు ప్లాన్‌. 50 శాతం ఆక్యుపెన్సీతో పెద్ద సినిమాలు విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ఆలోచిస్తారు. చిన్న సినిమాలు వ‌చ్చినా, పెద్ద‌గా ప్ర‌భావం ఉండ‌దు. ఈ గ్యాప్ ని వ‌కీల్ సాబ్ తో ఫిల్ చేయాల‌న్న‌ది దిల్ రాజు ఆలోచ‌న‌. వ‌కీల్ సాబ్ ఎడిటింగ్ రూమ్ లో ప‌క్క‌న పెట్టిసిన కొన్ని సీన్లు కూడా క‌లిపి… ఈసారి కొత్త వెర్ష‌న్ విడుద‌ల చేస్తే ఎలా ఉంటుందా? అనే ఆలోచ‌న‌లో దిల్ రాజు ఉన్నార్ట‌. ఇప్ప‌టికే అమేజాన్ లో వ‌కీల్ సాబ్ వ‌చ్చేసింది. థియేట‌ర్లో చూడ‌ని వాళ్లు అందులో క‌వ‌ర్ చేసేశారు. కాక‌పోతే.. ప‌వ‌న్ ని వెండి తెర‌పై చూసే మ‌జా వేరు క‌దా. అందుకే ఈ ఆలోచ‌న‌. మ‌రి ఈ ప్ర‌య‌త్నం ఏమేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రజల వరద కష్టాల కన్నా మీడియాకు సినిమా గొడవలే మిన్న !

ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో తుపాన్ బీభత్సం సృష్టించింది. ఏపీలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పటికీ తేరుకోలేదు. కొన్ని వందల గ్రామాల్లో అంధకారం అలుముకుంది. ఇక నష్టపోయిన వారి గురించిచెప్పాల్సిన...

పంజాబ్ కాంగ్రెస్ చిందర వందర !

అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదో చేద్దామని ప్రయత్నించిన కాంగ్రెస్ హైకమాండ్... పంజాబ్ లో పార్టీని చిందర వందర చేసుకుంది. సిద్దూకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి అందర్నీ కూల్ చేయాలనుకుంటే చివరికి అదే...

వైసీపీ గ్రామ సింహాలు ఇప్పుడు ఎక్కడ: పవన్ కళ్యాణ్

సినీ పరిశ్రమ సమస్యలపై పవన్ కళ్యాణ్ మాట్లాడగానే వైఎస్ఆర్సిపి మంత్రులందరూ వరస పెట్టి పవన్ కళ్యాణ్ పై ముప్పేట దాడి చేసిన సంగతి తెలిసిందే . అయితే పవన్ కళ్యాణ్ అక్కడితో ఆగకుండా...

బాహుబలి లెక్కలు బయటకు తీస్తామని సజ్జల హెచ్చరిక !

సినీ ఇండస్ట్రీ విషయంలో ప్రభుత్వం తీరుపై పవన్ కల్యాణ్ విమర్శల నేపధ్యంలో ఆయనకు మద్దతు పెరగకుండా చేసేందుకు ఏపీ ప్రభుత్వం చేయాల్సినదంతా చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి బాహుబలి...

HOT NEWS

[X] Close
[X] Close